బాబు యాత్రలో కత్తితో సోనియా!, సైకిల్ గిఫ్ట్(పిక్చర్స్)
గుంటూరు: పార్టీ సీనియర్ల మాట కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్ర పేరిట చేపట్టినా, అనూహ్య స్పందన చూసి తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెసు పార్టీ విభజన నిర్ణయం నేపథ్యంలో ఇటీవల పలు పార్టీలు తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకున్న విషయం తెలిసిందే.
చంద్రబాబు లేఖ వల్లనే విభజన జరుగుతుందని, ఆయన ఇచ్చిన లేఖను తిరిగి తీసుకోవాలని సీమాంధ్ర కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, సీమాంధ్ర కాంగ్రెసు నేతలు బలమైన సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఆత్మగౌరవం పేరిట యాత్ర చేపట్టేందుకు సిద్ధపడ్డారు. సీమాంధ్రలో ఉద్యమం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పార్టీ సీనియర్లు ఆయనను వారించారు. కానీ, ఆయన మాత్రం యాత్రపై వెనక్కి తగ్గలేదు. విభజన విషయంలో అసలు పాపం తనది కాదని.. కాంగ్రెసు, వైయస్ రాజశేఖర రెడ్డిలదేనని ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. సీమాంధ్రుల ఆందోళన సరైనదేనని చెప్పిన ఆయన ఇరు ప్రాంతాల జెఏసిలతో మాట్లాడాలని డిమాండ్ చేశారు.

ఆత్మగౌరవ యాత్ర
తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా పొందుగుల నుండి ఆదివారం తన ఆత్మగౌరవ యాత్రను ప్రారంభించారు. దీనికి భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు.

నన్నపనేని
తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా పొందుగుల నుండి ఆదివారం తన ఆత్మగౌరవ యాత్రను ప్రారంభించారు. యాత్రలో ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి.

చంద్రబాబు
గుంటూరు జిల్లా పొందుగుల నుండి ప్రారంభమైన ఆత్మగౌరవ యాత్రలో కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.

పయ్యావుల తనయుడు
ఆత్మగౌరవ యాత్రలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు సైకిల్‌ను బహూకరిస్తున్న పయ్యావుల కేశవ్ తనయుడు.

వర్ల రామయ్య
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర సందర్భంగా మాట్లాడుతున్న ఆ పార్టీ నేత వర్ల రామయ్య.

ప్రచారం రథం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర పేరుతో గుంటూరు జిల్లాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన ప్రచార రథం.

పుష్పగుచ్ఛం
తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పుష్పగుచ్ఛం ఇస్తున్న ఓ అభిమాని.

పసుపు రెపరెపలు
గుంటూరు జిల్లా పొందుగులలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్రకు తరలి వచ్చిన కార్యకర్తలు.

ప్రచార రథం నుండి స్పీచ్
గుంటూరు జిల్లా పొందుగుల నుండి ప్రారంభమైన ఆత్మగౌరవ యాత్రలో కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.

తమ్ముళ్లారా!
గుంటూరు జిల్లా పొందుగుల నుండి ప్రారంభమైన ఆత్మగౌరవ యాత్రలో కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.

మాట్లాడుతున్న బాబు
గుంటూరు జిల్లా పొందుగుల నుండి ప్రారంభమైన ఆత్మగౌరవ యాత్రలో కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.

సోనియా గాంధీ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్రలో సోనియా గాంధీ కత్తితో రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తున్నట్లుగా ఉన్న ఫ్లెక్సీ.

బాబు వేషధారి
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్రలో ఓ అభిమాని అధినేత మాస్కూ, వేషధారణతో ఆకట్టుకున్నాడు.












Click it and Unblock the Notifications