ప్రియురాలిపై యాసిడ్: అల్లుడి వేధింపులతో ఆత్మహత్య

Acid attack on girl
అనంతపురం: అనంతపురం జిల్లాలో ఓ యువతిపై యాసిడ్ దాడి జరిగింది. తనను ప్రేమించి మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన యువకుడిని బాధితురాలు నిలదీయడంతో అతను దాడి చేసినట్లుగా తెలుస్తోంది. జిల్లాలోని ముదిగుబ్బలో రాఘవ అనే వ్యక్తి ఓ అమ్మాయిని ప్రేమించాడు.

మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇది తెలిసిన ప్రేమించిన యువతి రాఘవను ఈ రోజు నిలదీసింది. అతను ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను, స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

ప్రియుడి ఇంటి ముందు ధర్నా

అదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని చింతగూడలో ప్రేమించి పెళ్లికి నిరాకరించాడని ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది.

అక్రమ టేకు కలప తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

తూర్పు గోదావరి జిల్లా భీమవరం ఏజెన్సీ ప్రాంతంలో అక్రమంగా విలువైన టేకు కలప తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్టు చేశారు.

ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

చిత్తూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఆత్మహత్యకు అల్లుడి వేధింపులో కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుల్లో తల్లి, తండ్రి, కూతురు, ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+