చెకప్ కోసం అమెరికాకు సోనియా: వెంట ప్రియాంక

గుండెనొప్పి, శ్వాసలో ఇబ్బందులతో ఆమె సతమతమయ్యారు. వెంటనే ఆమెను ఎయిమ్స్‌కు తరలించి చికిత్స చేశారు. పరీక్షలు నిర్వహించిన తర్వాత దగ్గు, తలనొప్పికి తీసుకున్న మాత్రలు రియాక్షన్ ఇవ్వడంతో ఆమెకు ఇబ్బందులు తలెత్తాయని వైద్యులు తెలిపారు.
కాగా, 2011 ఆగస్టు 5న అమెరికాలో సోనియాకు శస్త్రచికిత్స జరిగింది. అనంతరం నిరుడు ఫిబ్రవరి, సెప్టెంబర్ నెలల్లో ఆమె అక్కడకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పుడు మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తడంతో చెకప్ కోసం సోనియా అమెరికా వెళ్లారు.
సోమవారం ఎయిమ్స్‌లో ఐదు గంటల పాటు ఉన్న సోనియాకు వివిధ పరీక్షలు జరిగాయి. ఆ తర్వాత ఆమె డిశ్చార్జీ అయ్యారు.












Click it and Unblock the Notifications