20 రోజుల్లో కేబినెట్‌కు టి: షిండే, కొండ్రు కర్చీఫ్ వ్యాఖ్య

రాష్ట్రపతిపాలన ఆలోచిస్తాం: కేంద్రం తరఫు లాయర్
ఎపిఎన్జీవోల సమ్మెపై ఎపి హైకోర్టులో సోమవారం వాదనలు జరిగాయి. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇక్కడి ప్రభుత్వం విఫలమైందని గవర్నర్ నివేదిక ఇస్తే అప్పుడు కేంద్రం రాష్ట్రపతి పాలనపై ఆలోచిస్తుందని చెప్పారు. గవర్నర్‌ను తాము నివేదిక కోరుతామన్నారు.
షర్మిల, బాబులను అడ్డుకోవాలి: కొండ్రు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్రను, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల సమైక్య శంఖారావం యాత్రను సమైక్యవాదులు అడ్డుకోవాలని మంత్రి కొండ్రు మురళీ మోహన్ వేరుగా పిలుపునిచ్చారు. కొంతమంది కాంగ్రెసు నేతలు ఇతర పార్టీల్లో కర్చీఫ్‌లు వేసి ఇష్టంలేని పనులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజిస్తే విశాఖను రాజధానిగా చేయాలని లేదా ఉత్తరాంధ్రను తెలంగాణలో కలపాలని చెప్పారు.
రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదు: రఘువీరా
రాజీనామాలతో సమస్యలు పరిష్కారం కావని మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. రాజీనామా చేస్తే రాష్ట్రపతి పాలన వస్తుందని అప్పుడు సమైక్యాంధ్ర కోసం అడగడానికి ఉండదన్నారు. సమైక్యాంధ్ర కోసం తమ ప్రయత్నాలు తాము చేస్తున్నామన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు తమ ఆందోళనలను విరమించాలని కోరారు. ఆ బాధ్యత తమదని, ప్రజలను రెచ్చగొట్టడం సరికాదన్నారు. విభజనపై ఇప్పటి వరకు పార్టీలే నిర్ణయం తీసుకున్నాయని, ప్రభుత్వం తీసుకోలేదన్నారు. సమైక్యాంధ్ర కోసం తాము అధిష్టానాన్ని ఒప్పిస్తామని, ఎన్ని కష్టాలు వచ్చినా తాము కాంగ్రెసులోనే ఉంటామన్నారు.












Click it and Unblock the Notifications