టిపై హైద్రాబాద్‌లో పోటాపోటీ: 3 ఇడియట్స్(పిక్చర్స్)

హైదరాబాద్: హైదరాబాద్‌పై హక్కులే లక్ష్యంగా రెండు ప్రాంతాల ఉద్యోగులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. విభజన నిర్ణయం నేపథ్యంలో రెండు ప్రాంతాల ఉద్యోగుల ఆందోళనలు హైదరాబాదులో కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మాదేనంటూ తెలంగాణ ఉద్యోగులు, హైదరాబాద్ అందరిదీనంటూ సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న ఆందోళనతో ప్రభుత్వ కార్యాలయాలు హోరెత్తుతున్నాయి.

ఇరుప్రాంతాల ఉద్యోగుల ఆందోళన సోమవారం కూడా ఉద్రిక్త పరిస్థితుల్లో సాగింది. మంగళవారం నుంచి సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు సచివాలయంలో ఊపందుకున్నాయి. హైదరాబాద్‌పై హక్కు ఏ ఒక్కరికో సొంతం కాదని, ఆంధ్రప్రదేశ్‌లోని అందరికీ హైదరాబాద్ చెందినదంటూ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు.

సచివాలయంలోని ఎల్ బ్లాక్ ముందు వారు సోమవారం కూడా ధర్నా నిర్వహించారు. ఇదే సమయంలో తెలంగాణ ఉద్యోగులు కూడా సీమాంధ్ర ఉద్యోగుల ధర్నా చేస్తున్న ప్రాంతానికి అతి దగ్గరలోనే ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సచివాలయ భద్రత చూసే ఎస్పీఎఫ్ పోలీసులే కాకుండా బయటినుంచి కూడా పోలీసులు భారీగా మోహరించి రెండువర్గాల మధ్య ఘర్షణ తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.

ఎండోమెంట్

ఎండోమెంట్

పార్లమెంటులో త్వరగా తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దేవాదాయ శాఖ కార్యాలయంలో ఆందోళన చేస్తున్న తెలంగాణ ఉద్యోగులు.

ఎండోమెంట్ 1

ఎండోమెంట్ 1

రాష్ట్ర విభనను అడ్డుకోవద్దని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ దేవాదాయ శాఖ కార్యాలయంలో ఆందోళన చేస్తున్న తెలంగాణ ఉద్యోగులు.

ఎండోమెంట్ 2

ఎండోమెంట్ 2

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అందరూ సహకరించాలని కోరుతూ హైదరాబాదులోని దేవాదాయ శాఖ కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగుల ఆందోళన.

ఎండోమెంట్ 5

ఎండోమెంట్ 5

తెలంగాణ ముద్దు - సమైక్యం వద్దు, తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ దేవాదాయ శాఖ కార్యాలయం వద్ద తెలంగాణ ఉద్యోగుల ఆందోళన.

ఎండోమెంట్ 6

ఎండోమెంట్ 6

తెలంగాణ ముద్దు - సమైక్యం వద్దు, తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ దేవాదాయ శాఖ కార్యాలయం తెలంగాణ ఉద్యోగుల ఆందోళనలో నినాదాలు చేస్తున్న మహిళా ఉద్యోగి.

ఎపిఎన్జీవో 1

ఎపిఎన్జీవో 1

ఈ నెల 7వ తేదిన ఎల్పీ స్టేడియంలో తలపెట్టిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభకు సమైక్యవాదులు తరలి రావాలని కోరుతూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు.

తెలంగాణ 8427

తెలంగాణ 8427

పార్లమెంటులో త్వరగా తెలంగాణ బిల్లు పెట్టాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అందరు సహకరించాలని కోరుతూ తెలంగాణ ఎపిసిపిడిసిఎల్ కార్యాలయంలో ఆందోళన చేస్తున్న తెలంగాణ ఉద్యోగులు.

సీమాంధ్ర 8433

సీమాంధ్ర 8433

విభజనలో న్యాయం లేదు, విభజన ఒక విష బీజం, ట్ల కోసం రాష్ట్రాలు చీల్చవద్దు, వి వాంట్ జస్టిస్, స్టాప్ డివిజన్... అంటూ ఎపిసిపిడిసిఎల్ కార్యాలయంలో ఆందోళన చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు.

సీమాంధ్ర 8312(2)

సీమాంధ్ర 8312(2)

విభజన వద్దు.. సమైక్యాంధ్ర ముద్దు అంటూ సచివాలయంలో నిరసన తెలియజేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని నినాదాలు చేశారు.

సీమాంధ్ర 8312

సీమాంధ్ర 8312

ఏ దేశంలో దీనిని శాంతిర్యాలీ అంటారో మన సోదరులే చెప్పాలంటూ తెలంగాణ ఉద్యోగుల శాంతి ర్యాలీ పైన చిత్రం వేసి నిరసన తెలుపుతున్న సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు.

తెలంగాణ 8407(3)

తెలంగాణ 8407(3)

తెలంగాణ సచివాలయ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సచివాలయంలో తెలంగాణకు అనుకూలంగా శాంతి ర్యాలీ నిర్వహిస్తున్న తెలంగాణ ఉద్యోగులు.

తెలంగాణ 8407(5)

తెలంగాణ 8407(5)

విభజన అనివార్యం - ఆత్మీయతకు సహకారం, పట్టు వదలండి - రాష్ట్ర విభజనకు సహకరించండి అంటూ ర్యాలీ నిర్వహిస్తున్న సచివాలయ తెలంగాణ ఉద్యోగులు.

తెలంగాణ

తెలంగాణ

ప్రాంతాలుగా విడిపోదాం - అన్నదమ్ముల్లా కలిసుందాం - విభజనకు సహకరించండంటూ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సచివాలయంలో నిరసన దృశ్యం.

తెలంగాణ

తెలంగాణ

కిరణ్, బాబు, జగన్=3 ఇడియట్స్, అరచేతిలో సూర్యున్న ఆపలేరు.. కుట్రలతో తెలంగాణను అడ్డుకోలేరంటూ సచివాలయ తెలంగాణ సమన్వయ సంఘం ప్రదర్శన.

తెలంగాణ

తెలంగాణ

ప్రాంతాలుగా విడిపోదాం - అన్నదమ్ముల్లా కలిసుందాం - విభజనకు సహకరించండంటూ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సచివాలయంలో నిరసన దృశ్యం.

తెలంగాణ

తెలంగాణ

తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తెలంగాణకు మద్దతుగా నిరసన తెలుపుతున్న తెలంగాణ సచివాలయ ఉద్యోగులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+