బాబు, షర్మిల: చూపులు కలిసిన వేళ!(పిక్చర్స్)
హైదరాబాద్: సిడబ్ల్యూసి, యూపిఏ విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ సీమాంధ్రలో నిరసనలు కొనసాగుతున్నాయి. సమైక్యవాదులు వినూత్న నిరసనలు తెలుపుతున్నారు. ఆయా పార్టీల అనుబంధ సంస్థలు ఇతర పార్టీల నేతలను అసభ్యకర రీతిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసనలు తెలుపుతున్నారు. ఇవి వివాదానికి దారి తీస్తున్నాయి.
సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో నెల రోజులు దాటినా నిరసనల పర్వం కొనసాగుతోంది. ఆయా జిల్లాల్లో సమైక్యవాదులు మానవహారాలు, రోడ్ల పైనే వంటా వార్పు నిర్వహిస్తున్నారు. రాస్తారోకోలు, రోడ్ల పైనే దీక్షలు చేస్తున్నారు. కలిసి ఉంటే కలదు సుఖమంటూ హోమాలు నిర్వహిస్తున్నారు.
విశాఖలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిలల ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. నారా అండ్ వైయస్ వారి పెళ్లి పిలుపు అంటూ అందులో పేర్కొన్నారు. ఇది వివాదాస్పదమైంది. టిడిపి కార్యకర్తలు దానిని చించివేశారు.

జై సమైక్యాంధ్ర
ప్రకాశం జిల్లా ఒంగోలులో సమైక్యాంధ్ర కోసం రోడ్డుపై భారీ ర్యాలీ తీస్తున్న సమైక్యవాదులు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున సమైక్యవాదులు పాల్గొని జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.

మానవ హారం
సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో సమైక్యవాదులు మానవహారంగా నిరసన తెలుపుతున్న దృశ్యం. విద్యార్థులు మానవహారంలో పాలుపంచుకున్నారు.

రోడ్డుపై నిరసన
సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకాశం జిల్లా ఒంగోలులో రోడ్డు పైనే వడ్రంగి పనులు చేస్తూ నిరసన తెలుపుతున్న సమైక్యవాదులు. జై సమైక్యాంధ్ర ప్లకార్డులు ప్రదర్శించారు. పూజారి వేషంలో కెసిఆర్ ను ఉంచారు.

రోడ్డుపై ఆందోళన
సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకాశం జిల్లా ఒంగోలులో రోడ్డు పైనే వడ్రంగి పనులు చేస్తూ నిరసన తెలుపుతున్న సమైక్యవాదులు. జై సమైక్యాంధ్ర ప్లకార్డులు ప్రదర్శించారు.

తిరుపతి
చిత్తూరు జిల్లా తిరుపతిలో సమైక్యాంధ్ర తిరుపతి ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనను నిరసిస్తూ దీక్ష చేస్తున్న దృశ్యం.

నగర పాలక సంస్థ
చిత్తూరు జిల్లా తిరుపతిలో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా మోకాళ్ల పైన నిరసన తెలియజేస్తున్న ఉద్యోగులు.

జై సమైక్యాంధ్ర
చిత్తురు జిల్లా తిరుపతిలో సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్ష చేస్తున్న సమైక్యవాదులు. దీక్షలో జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తున్న దృశ్యం.

వలయాలు
చిత్తూరు జిల్లా తిరుపతిలో బోధన, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థుల ఆధ్వర్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా వలయాలతో నిరసన తెలుపుతున్న దృశ్యం.

వలయాలు 2
చిత్తూరు జిల్లా తిరుపతిలో బోధన, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థుల ఆధ్వర్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా వలయాలతో నిరసన తెలుపుతున్న దృశ్యం.

నిరసన
విశాఖపట్నంలో విభజనకు కారకులంటూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెసు పార్టీ నేతలు మధుయాష్కీ, బొత్స సత్యనారాయణ, మధుయాష్కీల ఫోటోలపై మూత్రం విసర్జిస్తూ నిరసన తెలుపుతున్న దృశ్యం.

గుడ్లతో నిరసన
విశాఖపట్నంలో విభజనకు కారకులంటూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెసు పార్టీ నేతలు మధుయాష్కీ, బొత్స సత్యనారాయణ, మధుయాష్కీల ఫోటోలపై మూత్రం విసర్జిస్తూ, గుడ్లు వేస్తూ నిరసన తెలుపుతున్న దృశ్యం.

గుడ్లతో...
విశాఖపట్నంలో విభజనకు కారకులంటూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెసు పార్టీ నేతలు మధుయాష్కీ, బొత్స సత్యనారాయణ, మధుయాష్కీ, కెసిఆర్‌ల ఫోటోలపై మూత్రం విసర్జిస్తూ, గుడ్లు వేస్తూ నిరసన తెలుపుతున్న దృశ్యం.

కెసిఆర్‌తో బాక్సింగ్
రాష్ట్ర విభజనకు కారకుడంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో బాక్సింగ్ చేస్తూ నిరసన తెలుపుతున్న సమైక్యవాదులు.

కోదండతో బాక్సింగ్
రాష్ట్ర విభజనకు కారకుడంటూ తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్‌తో బాక్సింగ్ చేస్తూ నిరసన తెలుపుతున్న సమైక్యవాదులు.

రిక్షా ర్యాలీ
సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖలో కస్టమర్స్‌తో రిక్షా ర్యాలీ దృశ్యం. విశాఖలో సమైక్యవాదులు వివిధ రీతుల్లో నిరసనలు తెలియజేస్తున్నారు.

యోగా
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ ఉపాధ్యాయులు సమైక్యాంధ్ర కోసం విశాఖలో యోగా చేస్తు నిరసన తెలుపుతున్న దృశ్యం.

నారా అండ్ వైయస్
సమైక్యాంధ్రకు శుభం కార్డు వేయడానికి కెసిఆర్ తో కుమ్మక్క, ఇంకా ఏం మొహం పెట్టుకొని బస్సు యాత్ర మొదలుపెట్టారని, జనాన్ని మోసం చేయలేరని బాబు, షర్మిలలపై మండిపడుతూ సమైక్యవాదులు ఏర్పాటు చేసిన వినూత్న ఫ్లెక్సీ. ఈ ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది.

నారా అండ్ వైయస్
సమైక్యాంధ్రకు శుభం కార్డు వేయడానికి కెసిఆర్ తో కుమ్మక్క, ఇంకా ఏం మొహం పెట్టుకొని బస్సు యాత్ర మొదలుపెట్టారని, జనాన్ని మోసం చేయలేరని బాబు, షర్మిలలపై మండిపడుతూ సమైక్యవాదులు ఏర్పాటు చేసిన వినూత్న ఫ్లెక్సీ. ఈ ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది.

చించివేత
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలితో కలిపి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని టిడిపి నేతలు చించివేస్తున్న దృశ్యం.

వాగ్వాదం
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలితో కలిపి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై టిడిపి నేతల వాగ్వాదం.

కెసిఆర్ - బాబు
విశాఖ జిల్లాలో ఎన్ఎస్‌యుఐ అండ్ యూత్ కాంగ్రెసు ఆధ్వర్యంలో తెరాస అధ్యక్షుడు కెసిఆర్, టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడులను కుక్క, నక్కలతో పోల్చుతూ ఫ్లెక్సీ.

కొండ్రు మురళి
సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖలో మంత్రి కొండ్రు మురళి మోహన్ దిష్టి బొమ్మను కొడుతూ నిరసన తెలుపుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.

బంతి తిప్పుతూ..
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును బంతిలా తిప్పుతూ నిరసన తెలుపుతున్న యూత్ కాంగ్రెసు పార్టీ నాయకుడు.












Click it and Unblock the Notifications