హైదరాబాద్ యుటిగా వద్దు, నిలకడ లేదు: లగడపాటి

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై పార్టీల్లో నిర్ణయం నిలకడగా లేదని విజయవాడ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. అందువల్ల కేంద్ర విభజనకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆయన కేంద్రాన్ని కోరారు. గతంలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన పార్టీలు కూడా ఇప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నాయని ఆయన అన్నారు.

సీమాంధ్ర ప్రజల ఆందోళనల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు సమైక్యం వైపు మొగ్గు చూపుతున్నాయని అన్నారు. కానీ ఏ పార్టీ అయితే తన పొలిట్ బ్యూరోలో సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తుందో ఆ పార్టీలనే ప్రజలు నమ్ముతారన్నారు. సమైక్య రాష్ట్రానికి మద్దతు పలకాలని సీపీఐ, బీజేపీ, టీడీపీలకు లేఖలు రాసినట్లు తెలిపారు.

Lagadapati Rajagopal

హైదరాబాద్‌ను కొందరు నేతలు కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరడం సరికాదన్నారు. కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఇరు ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. సమైక్యవాదులు ఎప్పుడూ హైదరాబాద్ ను యూటీ చేయాలని కోరరని ఆయన అన్నారు.

సీమాంధ్రలో జరుగుతున్నది ప్రజల ఉద్యమమని, పార్టీల ప్రమేయం లేదని లగడపాటి రాజగోపాల్ అన్నారు. ప్రజలు ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని అన్నారు. ప్రజల ఆందోళనలతోనే పార్టీలు సమైక్య రాష్ట్రానికి మద్దతు పలుకుతున్నాయని అన్నారు.

సమైక్య రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో సీమాంధ్ర కాంగ్రెస్ కేంద్రమంత్రులు, ఎంపీలు ఒత్తిడి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంటోని కమిటీకి కూడా సమైక్యమే సమస్యకు పరిష్కారమని తెలిపినట్లు చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తుందన్న నమ్మకముందన్నారు.

రాష్ట్రాన్ని విభజిస్తే సాగునీరు, విద్యుత్ విషయంలో సమస్యలు తలెత్తే అవకాశముందన్నారు. రాష్ట్ర రాజధానిలో ఏపీ ఎన్జీవోలు శాంతియుతంగా చేస్తామన్న సభను అడ్డుకుంటామని అనడం సరికాదన్నారు. హైదరాబాద్ లోని ప్రభుత్వ కార్యాలయాల్లో సీమాంధ్రుల ఉద్యమాలకు పోటీగా తెలంగాణ ఉద్యోగులు ఆందోళనలు చేయడమేంటని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీమాంధ్రులు అలా చేయలేదన్నారు.

సీమాంధ్ర ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతున్నారన్నారు. వారికి మద్దతుగా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఉన్నారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వరకు పోరాటం సాగిస్తామన్నారు. సమైక్య రాష్ట్రం తప్ప మరో ప్రత్యామ్నాయానికి అంగీకరించమని కేంద్రానికి స్పష్టం చేసినట్లు లగడపాటి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+