భర్త తోడ్పాటుతో 4 నెలలు మహిళపై గురువు రేప్

పోలీసులు మంగళవారంనాడు మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో గల నీలఖండ్ గ్రామంలోని మహేంద్ర గిరి అలియాస్ తున్ను బాబా ఆశ్రమంపై దాడి చేసి, అతన్ని అరెస్టు చేశారు. మహిళకు విముక్తి కలిగించారు. బాధితురాలి భర్త, అత్త కూడా అదే ఆశ్రమంలో ఉంటున్నారు.
మహిళపై అత్యాచారానికి గిరికి ఆమె భర్త, అత్త కూడా సహాయం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వారిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని విశ్రాం బంజారా ఈ ఏడాది మేలో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే గిరి ఆమెపై లైంగిక దాడికి దిగాడు.
అత్యాచారం, అక్రమ నిర్బంధం, తదితర సెక్షన్ల కింద పోలీసులు గిరిపై కేసు నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications