హైకోర్టు, ఐటి పార్క్..: టిపై ఆంటోనికి కిషోర్ డిమాండ్స్
న్యూఢిల్లీ: సిడబ్ల్యూసి రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ పార్టీ వేసిన ఆంటోని కమిటీ ముందు తమ డిమాండ్లు పెట్టారు. మంగళవారం రాత్రి ఆంటోని కమిటీని సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు కలిసినప్పుడు కిషోర్ వెళ్లలేదు. బుధవారం ఆయన నాలుగ పేజీల లేఖను కమిటీకి రాశారు. అందులో పలు డిమాండ్లు చేశారు.
విశాఖపట్నంలో రాష్ట్ర హైకోర్టును ఏర్పాటు చేయాలని, ఆగ్నేయ రైల్వే జోన్‌లోని కుంద్రా డివిజన్‌ను తూర్పు తీర రైల్వే జోన్‌కు జత చేసి ప్రధాన కార్యాలయాన్ని విశాఖకు బదలీ చేయాలని, విజయవాడ డివిజన్‌ను కూడా తూర్పు తీర రైల్వేకు జత చేయాలని కోరారు.

విశాఖలో సైబర్ టవర్స్ పేరుతో కూడన ఐటి పార్క్, ఎయిమ్స్, ఐఐటి, ఐఐఎంలు నెలకొల్పాలని, మెట్రో రైల్ నిర్మించాలని, సముద్ర శాస్త్ర పరిశోధన సంస్థ, కేంద్రీయ విశ్వవిద్యాలయాలను, గిరిజిన పరిశోధన సంస్థ, అమర్ కంఠక్‌లోని గిరిజన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ప్రత్యేక గిరిజన విద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు.
తీర ప్రాంతం పొడవునా, కొండలపై పవన విద్యుత్తు ఉత్పత్తికి ఏర్పాటు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో సౌర విద్యుత్తు కేంద్రాలు నెలకొల్పాలని, పర్యావరణానికి హాని తలపెట్టకుండా చిన్న చిన్న లాశయలాు కట్టి సాగునీరు ఇవ్వాలని, ఉత్తరాంధ్ర పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, కొల్లేరు సరస్సు, శ్రీకాకుళం జిల్లాలోని బౌద్ధ వలయాలను త్వరగా పునరుద్ధరించాలని కోరారు.












Click it and Unblock the Notifications