జగన్ పార్టీ నినాదాలు: పులివెందులకొస్తానని బాబు ఫైర్

జోహార్ వైయస్సార్.. జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ అడ్డు తగిలారు. చంద్రబాబు ప్రయాణిస్తోన్న వాహనానికి అడ్డుగా నిలుచుని నినాదాలు చేశారు. వాళ్లని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరారు. వారిని అడ్డుకోబోగా బాబు వారించారు. అయినా వారు అదే పనిగా నినాదాలు చేశారు. దీంతో వారి పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీరంతా జైలులో ఉండాల్సిన వాళ్లు బయటతిరుగుతున్నారని, పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తానని, ఏదైనా ఉంటే ప్రజల్లో తేల్చుకోవాలని, ఇలా దొంగదారిన వచ్చి వీరంగం చేయడం ఎక్కడి సంస్కృతి అని, మీ పులివెందులకే వస్తానని, అక్కడే మీ సంగతి తేలుస్తానంటూ మండిపడ్డారు. కాన్వాయ్‌లోకి వేరే వ్యక్తలు వస్తుంటే ఏం చేస్తున్నారని బాబు పోలీసులను కోపగించుకున్నారు.
కాగా, ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్, జగన్ డిఎన్ఏ ఒక్కటేనని, అదే అవినీతి డిఎన్ఏ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. గురువారం రాత్రి బండారుపల్లిలో జరిగిన ఆత్మగౌరవ యాత్రలో చంద్రబాబు ప్రసంగిస్తూ కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల పైన నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications