బొత్స ద్వారా 10కోట్లకు ఎమ్మెల్యేల కొనుగోలు!: దేవినేని

ఒక్కో ఎమ్మెల్యేకు రూ.10 కోట్లు ఇచ్చి తీర్మానం కోసం కొనుగోలు చేయాలని కాంగ్రెసు పార్టీ అధిష్టానం చూస్తోందన్నారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో న్యాయవాదులపై దాడులు సిగ్గుచేటు అన్నారు. దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తొందరపాటు నిర్ణయం వల్ల ఇలాంటి దుస్థితి ఏర్పడిందన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలను కాంగ్రెసు పార్టీ రెచ్చగొట్టిందన్నారు.
వాదనలో పసలేకే దాడులు: గంటా
తెలంగాణవాదుల వాదనలో పసలేకపోవడం వల్లనే వారు దాడులకు దిగుతున్నారని మంత్రి గంటా శ్రీనివాస రావు విశాఖలో అన్నారు. హైకోర్టులో న్యాయవాదులపై దాడి ఘటన రాష్ట్ర చరిత్రలోనే బ్లాక్ డే అన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
కుటుంబ సభ్యులుగా చూసుకుంటాం: అంజన్
హైదరాబాదులో ఉన్న సీమాంధ్రులను తాము కుటుంబ సభ్యులుగా చూసుకుంటామని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ న్యూఢిల్లీలో అన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ఒప్పుకునేది లేదన్నారు. హైదరాబాదుతో కూడి పది జిల్లాల తెలంగాణనే కావాలన్నారు.
ప్రజలతో కలిసి ఉద్యమం: శివ ప్రసాద్
సీమాంధ్ర ప్రజల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టిడిపి ఎంపి శివ ప్రసాద్ ఢిల్లీలో అన్నారు. ప్రజలతో కలిసి ఉద్యమించి ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. సీమాంధ్ర ప్రజల ఆందోళన, ఆవేదనను సభ దృష్టికి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేశామన్నారు. వారు ఈ రోజు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.












Click it and Unblock the Notifications