భార్యపై అనుమానం: కొడుకు హత్య, ఆత్మహత్యాయత్నం

Man kills son suspecting wife's relation
హైదరాబాద్: భార్యపై అనుమానంతో గొడవ పడుతూ వచ్చిన ఓ వ్యక్తి ఆమెపై కోపంతో నాలుగేళ్ల కుమారుడిని చంపి, తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. భార్య అలిగి పుట్టింటికి వెళ్లడంతో కోపంతో కుమారుడి గొంతు నులిమి చంపి, తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన తాపీమేస్త్రీ మిర్యాల సత్యనారాయణ (28) చంపాపేటలోని రెడ్డికాలనీలో నివాసం ఉంటున్నాడు.

అతని భార్య శ్రీలత ఓ ప్రైవేట్ కంపెనీలో దినసరి కూలీగా పనిచేస్తున్నది. వీరి కుమారుడు వెంకటసాయి (4) స్థానికంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న సత్యనారాయణ తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలో గత నెల 28న భార్యను కొట్టాడు. దీంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్లింది.

సత్యనారాయణ తల్లి నాగమణి వారం రోజులుగా వెంకటసాయి ఆలనాపాలనా చూసుకుంటుంది. భార్య అలిగి వెళ్లిందన్న కోపంతో తప్ప తాగి వచ్చిన సత్యనారాయణ బుధవారం రాత్రి నిద్రిస్తున్న కుమారుడి గొంతు నులిమి చంపాడు. అనంతరం భయంతో కత్తితో మెడ, చేతులపై కోసుకున్నాడు.

గురువారం ఉదయం నాగమణి గమనించి ఇంటి పక్కన ఉంటున్న వారికి తెలిపింది. దీంతో వారు సైదాబాద్ పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించి, తండ్రిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+