వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైంగిక దాడి: సిడి ఆశారాం బాపును పట్టిస్తుందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

జోథ్‌పూర్: వివాదాస్పద బాబా ఆశారాం బాపు వ్యవహారాన్ని తేల్చడానికి పోలీసులు అహ్మదాబాద్‌ ఆశ్రమంలోనూ ఇతర ప్రాంతాల్లోనూ పోలీసులు సిడి కోసం గాలిస్తున్నారు. ఆ సిడిని ఆశారాం సన్నిహిత సహచరుడు శివ కలిగి ఉన్నట్లు భావిస్తున్నారు. 16 బాలికపై లైంగిక దాడికి ప్రేరేపించడానే ఆరోపణపై పోలీసులు శివను అరెస్టు చేశారు. శివ ఆ సిడి గురించి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సిడి ద్వారా ఆశారాం లైంగిక దాడికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తుందని పోలీసులు భావిస్తున్నారు.

అమ్మాయిలు, మహిళలతో రహస్యంగా ఆశారాం బాపు మంత్రాలను చదివించడం, మతపరమైన ప్రార్థనలు చేయించడం వంటివాటిని ఎలా నిర్వహించాడనే విషయంపై ఆ సిడి వివరాలను వెల్లడిస్తుందని భావిస్తున్నారు. దర్యాప్తునకు సిడి అత్యంత ప్రధానమైందని, ఆ సిడిని సంపాదించడానికి శివను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రాసిక్యూషన్ న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దీంతో శివను మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Asaram Bapu

సిడిని స్వాధీనం చేసుకోవడానికి అహ్మాదాబాద్‌లోని ఆశారాం బాపు ఆశ్రమానికి, ఇతర ప్రాంతాలకు పోలీసు బృందం వెళ్లినట్లు అధికారులు చెప్పారు. సిడి విషయంలో శివ మాట మారుస్తున్నాడు. పోలీసులు ఏ సిడి గురించి మాట్లాడుతున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నాడు.

ఆశారాం ఒంటరిగా ఏ మహిళను గానీ బాలికను గానీ కలుసుకోలేదని అతను అన్నాడు. బాలికపై అత్యాచారం జరిగిందని చెబుతున్నా రాత్రి తాను ఆశ్రమంలో లేనని అతను చెప్పాడు. తాను సాయంత్రం 7 గంటలకు బయటకు వెళ్లిపోయానని, దాన్ని తాను నిరూపించగలనని అంటున్నాడు. ఆశారాంను దెబ్బ తీయడానికి కాంగ్రెసు కుట్ర చేస్తోందని విమర్శిస్తున్నాడు.

English summary
A police team will soon be sent to godman Asaram's ashram in Ahmedabad and certain other places in search of a CD said to have been in the possession of his close aide Shiva.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X