ఖైరతాబాద్ గణేషుడి వద్ద క్లిక్, కిరణ్ పూజలు(పిక్చర్స్)
హైదరాబాద్: గణేష్ నవరాత్రుల సందర్భంగా నగరంలోని ఖైరతాబాద్‌లో భారీ గణనాథుని సోమవారం ప్రతిష్టించారు. నగరంలోని రాజకీయ పార్టీ కార్యాలయాల్లో గణేష్ పూజలు నిర్వహించారు.
హైదరాబాదులోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పూజలు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో గణేషుడికి ప్రత్యేక పూజలు చేశారు.
ఖైరతాబాద్ గణేషుడికి గవర్నర్ నరసింహన్ దంపతులు సోమవారం ఉదయం తొలి పూజలు నిర్వహించారు. గవర్నర్ దంపతులకు పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ శాలువా కప్పి ఆహ్వానం పలికారు. వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

నరసింహన్
ఖైరతాబాద్ గణేషుడి వద్ద గవర్నర్ నరసింహన్ దంపతులు సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. గణేషుడిని ప్రతిష్టించాక గవర్నర్ దంపతులు మొదటి పూజ చేశారు.

మాట్లాడుతున్న గవర్నర్
ఖైరతాబాద్ గణేషుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్న గవర్నర్ నరసింహన్. ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

మాట్లాడుతున్న అంజన్
ఖైరతాబాద్ గణేషుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్న సికింద్రాబాదు పార్లమెంటు సభ్యులు అంజన్ కుమార్ యాదవ్.

గణేషుడి వద్ద గవర్నర్ దంపతులు
ఖైరతాబాద్ గణేషుడి వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గవర్నర్ నరసింహన్ దంపతులు. ఆయనకు సెక్యూరిటీ సంజ్ఞలు చేస్తున్న దృశ్యం.

గణేషుడి వద్ద గవర్నర్
ఖైరతాబాద్ గణేషుడి విగ్రహాన్ని రూపొందించిన శిల్పిని గవర్నర్ దంపతులు సోమవారం వినాయకుడికి పూజలు చేసిన అనంతరం సత్కరించారు.

క్లిక్ క్లిక్...
భారీ ఖైరతాబాద్ గణేషుడి విగ్రహాన్ని తన కెమెరాల్లో బందించేందుకు పోటీ పడుతున్న ఫోటో జర్నలిస్టులు. ఈ గణేషుడు 59 అడుగుల ఎత్తు ఉన్నాడు.

క్యాంప్ ఆఫీసులో కిరణ్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాదులోని క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా గణేషుడికి ప్రత్యేక పూజలు చేశారు.

హారతి ఇస్తున్న కిరణ్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాదులోని క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా గణేషుడికి ప్రత్యేక పూజలు చేశారు.

దేవుడికి నమస్కారాలు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాదులోని క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా గణేషుడికి ప్రత్యేక పూజలు చేశారు.

బిజెపి కార్యాలయంలో
రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గణేష్ పూజలో పాల్గొన్న ఆ పార్టీ నేతలు కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ తదితరులు.












Click it and Unblock the Notifications