సమైక్యపై టినేతలతో కిరణ్ లాజిక్, సీమాంధ్రుల నిలదీత

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే తాను సమైక్యాంధ్ర కావాలంటున్నానని కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రాంత మంత్రులతో చెప్పారట. గతంలో తెలంగాణ ప్రాంతంలో ఆందోళనలు జరిగాయని, అప్పట్లో ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్నానని, నాడు తెలంగాణ ప్రజల మనోభావాలను బట్టి ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలను ఏనాడూ తప్పుపట్టలేదని, సకల జనుల సమ్మెనూ తప్పుపట్టలేదని, ఇప్పుడు సీమాంధ్రలో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయని, అక్కడి ప్రజల మనోభావాలను కూడా అర్థం చేసుకున్నానని చెప్పారట.

ఎపి ముఖ్యమంత్రిగానే తాను సమైక్యాంధ్రను కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారట. సచివాలయంలో మంగళవారం కిరణ్‌తో మంత్రులు డికె అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, సుదర్శన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీమాంధ్ర సిఎంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోందని, సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకుని సీమాంధ్ర ఉద్యమానికి, నేతలకు మీరు సహకరిస్తున్నారని పలువురు భావిస్తున్నారంటూ కిరణ్ వద్ద తెలంగాణ మంత్రులు ప్రస్తావించారు.

Kiran Kumar Reddy

దానికి జవాబుగా.. అలాంటిదేమీ లేదని కిరణ్ చెప్పారట. రాష్ట్ర సిఎంగా సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నానని, రాష్ట్ర విభజన వల్ల కలిగే నష్టాలను వివరించానని తెలిపారు. అంత మాత్రాన తాను సీమాంధ్ర పక్షపాతిని కానని, అలాగని, తెలంగాణకు వ్యతిరేకినీ కానని చెప్పారు. తెలంగాణలో ఉద్యమం జరుగుతున్నప్పుడూ ఇప్పుడూ ఇరు ప్రాంతాల మనోభావాలను అర్థం చేసుకున్నానని, తప్పితే.. ఒక ప్రాంతం వైపు ఒరిగిపోయానని భావించడం సరికాదని కిరణ్ చెప్పారు.

ఎపిఎన్జీవోల సభకు అనుమతికి, తనకు సంబంధం లేదన్న కిరణ్, ఆ సభకు నల్ల జెండాలతో నిరసన తెలపడం సహేతుకమేనా అని మంత్రులను కిరణ్ ప్రశ్నించారట. అయితే, ఎపిఎన్జీవోలు సభ నిర్వహించుకోవడాన్ని తాము వ్యతిరేకించలేదని, రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని మాత్రమే సూచించామని అరుణ వివరించారు. మరోవైపు విభజన తీర్మానం శాసన సభలో రెండు దఫాలుగా చర్చకు వస్తుందని తెలంగాణ మంత్రులకు కిరణ్ చెప్పారు.

కొత్త పార్టీ యోచన లేదు

తనకు కొత్త పార్టీ పెట్టే యోచన లేదని సీమాంధ్ర మంత్రులతో కిరణ్ చెప్పారని తెలుస్తోంది. ఆయనను సీమాంధ్ర మంత్రులు కలిసినప్పుడు కొత్త పార్టీ విషయమై ఆయన నిలదీశారట. మీరంతా సమావేశమయ్యారని, రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి చర్చించుకున్నారని, సారధ్య బాధ్యతలను తనకెందుకు అంటగడతారని ప్రశ్నించారట. కొత్తగా పార్టీ పెట్టే యోచన తనకు లేదని స్పష్టం చేశారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+