పాలమూరు, టి బంద్: విభేదాలకు జెఏసి, బిజెపి చెక్
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి, భారతీయ జనతా పార్టీల మధ్య విభేదాలు తొలగిపోయాయి. పాలమూరు ఉప ఎన్నిక సమయం నుండి విభేదాలు పొడసూపాయి. మంగళవారం ఐకాస చైర్మన్ కోదండరామ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తదితర నేతలతో భేటీ అయ్యారు. తెలంగాణపై భవిష్యత్ కార్యాచరణకు ఐకాస సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ సందర్భంగా పలు అంశాలపై వారు చర్చించారు. అనంతరం ఐకాస స్టీరింగ్ కమిటీ భేటీకి బిజెపి నేతలు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ ఎన్నికల్లో జెఏసి తటస్థంగా ఉండటం పొరపాటేనంటూ మైనారిటీలతో ఓ భేటీలో కోదండరాం అన్నట్లు వచ్చిన వార్తలపై బిజెపి నేతలు తీవ్ర అభ్యంతరం చెప్పారు. అయితే, తానలా మాట్లాడలేదని ఆయన బదులివ్వగా, ఆ మేరకు ప్రచురితమైన కథనాలు వారు చూపారు.

అలా వ్యాఖ్యానించకపోతే ఈ వార్తలను అప్పుడే ఎందుకు ఖండించలేదని నిలదీశారు. అయితే, జెఏసిలో నిర్ణయించకుండా సొంత అభిప్రాయం ఎలా చెబుతానని కోదండరాం సముదాయించారు. ఇక సీమాంధ్ర జిల్లాల్లో బిజెపి కార్యాలయాలపై దాడులను జెఏసి ఖండించకపోవడాన్ని నిరసించారని తెలిసింది. మరోవైపు పార్లమెంటులో వెంకయ్య నాయుడు ప్రసంగం, సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్‌పై సుష్మాస్వరాజ్ వ్యవహరించిన తీరు ప్రజలకు మరో రకమైన సంకేతాలు పంపినట్లు జెఏసి నేతలు ప్రస్తావించారు.
అయితే, వెంకయ్య తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్న సంగతి ఆయన ప్రసంగం పూర్తిపాఠం వింటే ఇది అర్థమవుతుందని బిజెపి చెప్పారు. అలాగే బిఏసిలో నిర్ణయానికి వ్యతిరేకంగా సస్పెండ్ చేసినందుకే నిరసన తెలిపినట్లు వివరించారు. తెలంగాణ బంద్‌కు బిజెపి పూర్తి మద్దతు ఇవ్వకపోవడంపైనా జెఏసి నేతలు ప్రశ్నించగా, తమ జాతీయ పార్టీ కాబట్టి, ఆ విధానాలకు లోబడక తప్పదని కిషన్ రెడ్డి చెప్పారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications