మానవీయ విలువలేవి?, గన్‌మెన్లను పంపారు: హరీష్

సీమాంధ్ర పెట్టుబడిదారులకు, కార్పోరేట్ సంస్థలకు కొమ్ముకాసేందుకే సీమాంధ్ర ఉద్యమమన్నారు. సీమాంధ్రలో ఉన్న నిరుపేదల కడుపుకొట్టి సమ్మె పేరుతో దోచుకుంటున్నారన్నారు. కొంతమంది సీమాంధ్ర మంత్రులు తెలంగాణ గన్‌మెన్లపై నమ్మకం లేదంటూ వెనక్కి పంపడమేమిటని ప్రశ్నిచారు.
గన్‌మెన్లను వెనక్కి పంపి తెలంగాణ పోలీసులను అవమానపర్చారన్నారు. కలిసుందామనే వారు గన్‌మెన్లను ఎందుకు వెనక్కి పంపారో చెప్పాలన్నారు. సీమాంధ్రలో సమ్మె పేరిట గిరిజనులకు వైద్యం అందించే పిహెచ్‌సిలు బందు చేశారు తప్ప కార్పోరేట్ వైద్యం ఆగిందా చెప్పాలన్నారు.
సీమాంధ్ర నేతలు కలిసుందామని చెబుతూనే విడిపోయే పనులు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు సంయమనంతో వ్యవహరించడం వల్లనే ఎపిఎన్జీవోల సభ సజావుగా సాగిందన్నారు. విద్యార్థులు, కానిస్టేబుళ్లపై జరిగిన దాడిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల ఎందుకు ఖండించలేదన్నారు. మంత్రి శైలజానాథ్ సీమాంధ్ర దళితులకు అన్యాయం చేస్తూ పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications