అర్థరాత్రి నుంచి సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మె

హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రకు చెందిన విద్యుత్తు ఉద్యోగులు బుధవారం అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నారు. ఈ మేరకు వారు ఎపి జెన్కో, ఎపి ట్రాన్స్‌కో, డిస్కంల మేనేజింగ్ డైరెక్టర్లకు సమ్మె నోటీసు ఇచ్చారు. దాదాపు 30 వేల మంది విద్యుత్తు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని అంచనా.

ప్రభుత్వానికి సిమ్‌కార్డులను అప్పగించారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో కరెంట్ కష్టాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు చేపట్టనున్న సమ్మెపై పునరాలోచించుకోవాలని ఏపీ జెన్‌కో చైర్మన్ సురేష్ చందా కోరారు. విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతే పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆయన తెలిపారు.

Seemandhra staff in power sector to go on strike

సమ్మెపై సిఎం సమీక్ష

ఇదిలావుంటే, సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో ఉద్యోగులు చేస్తున్న సమ్మెపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నిత్యావసర సరుకుల రవాణా, విద్యా, ఆరోగ్య, విద్యుత్ సర్వీసులకు అంతరాయం కలగకుండా సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసి సీమాంధ్ర నేతలతో బొత్స చర్చలు

సమైక్యాంధ్రకు మద్దతుగా కొద్ది రోజులుగా సీమాంధ్రలో ఆర్టీసీ బంద్ పాటిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ సీమాంధ్ర ఈయూ నేతలతో రవాణా శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ బుధవారం చర్చలు జరిపారు. ప్రయాణికుల ఇబ్బందులు, సంస్థ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సమ్మె విరమించుకోవాలని నేతలను బొత్స కోరారు.

అయితే ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా గుర్తిస్తే సమ్మె విరమణకు తాము సిద్ధమని సీమాంధ్ర ఈయూ నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తిస్తూ ప్రకటన వెలువడితే ఈనెల 16న ఏపీఎన్జీవోల సమావేశంలో చర్చించి సమ్మె విరమణ ప్రకటన చేస్తామని ఈయూ నేత పద్మాకర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+