బాబు సభలో జగన్ పార్టీ సమైక్యాంధ్ర స్లోగన్స్

విజయవాడ/ విశాఖపట్నం/ ఏలూరు : కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు సమైక్య నిదాలు చేశారు. దీనిపై బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పిచ్చి వేశాలు వేస్తే సహించేది లేదన్నారు. తాము తలుచుకుంటే మీ పార్టీ నేతలు ఇంట్లో నుంచి బయటకు రాలేరని హెచ్చరించారు.
సమైక్యం పేరుతో కాంగ్రెస్‌తో కలిసి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ బీజం వేసింది వైయస్ రాజశేఖర రెడ్డేనని అని ఆయన తెలిపారు. మీ నాయకుడు జైల్లో ఉన్నా మీకు సిగ్గు లేదని, గట్టిగా మాట్లాడితే అంతు చూస్తామని చంద్రాబాబు హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌కు విశాఖపట్నంలో సమైక్య సెగ తగిలింది. బుధవారం అనందపురంలో సుబ్బిరామిరెడ్డి, అవంతి కాన్వాయ్‌ను ఉపాధ్యాయ జేఏసీ నేతలు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లాలో నిరసనలు కొనసాగుతున్నాయి. బుధవారం ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్ దగ్గర సమైక్యాంధ్ర కోసం యువ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీగా సమైక్యవాదులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ పశ్చిమ గోదావరి జిల్లాలో సీమాంద్రులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. బుధవారం తణుకులో ఎమ్ఎస్‌వోల ఆధ్వర్యంలో లక్ష గళ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి కేబుల్ ఆపరేటర్‌లు, సమైక్యవాదులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.












Click it and Unblock the Notifications