తగ్గకుంటే లోకేష్ లీలలు బయటపెడ్తాం: జగన్‌పార్టీ వార్న్

వైయస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చినంత ప్రచారం, ఆదరణ లోకేష్‌కు రాలేదనే బాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నారా లోకేష్ ఓ చవటబ్బాయి అని దుయ్యబట్టారు. జగన్‌కు వచ్చిన ఆదరణ కొడుక్కు రాలేదని జగన్ పైన మండిపడటమేమిటని ప్రశ్నించారు.
నారా లోకేష్ లీలలు టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడుకు బాగా తెలుసునన్నారు. బాబు గోబెల్స్ ప్రచారం మానకుంటే లోకేష్ లీలలు బయటపెడతామన్నారు. చంద్రబాబు చేస్తోంది తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర కాదని, తమ పార్టీ పైన విష ప్రచార యాత్ర అన్నారు.
బాబు గోబెల్స్ ప్రచారం చేసే స్వర్గీయ నందమూరి తారక రామారావును దించి ఆ గద్దెపై కూర్చున్నారని ధ్వజమెత్తారు. నేర చరితుల్లో తెలుగుదేశం పార్టీదే అగ్రస్థానమన్నారు. ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రకారం నేర చరితుల్లో టిడిపి నేతలు 28 మంది ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications