Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బ్యాంకాక్‌లో ఆనందమైన హనీమూన్ ప్లాన్ కోసం ఆరు స్టెప్స్

వివాహ ప్రణాళికలో హనీమూన్ చాలా ముఖ్యమైనది. హానీమూన్ అంశం గురించి మాట్లాడినప్పుడు చాలామంది ముసిముసిగా నవ్వుతారు లేదా అదో రకంగా చూస్తారు.

వివాహ ప్రణాళికలో హనీమూన్ చాలా ముఖ్యమైనది. హానీమూన్ అంశం గురించి మాట్లాడినప్పుడు చాలామంది ముసిముసిగా నవ్వుతారు లేదా అదో రకంగా చూస్తారు. కానీ వాస్తవం ఏమంటే కొత్తగా పెళ్లయిన జంట హనీమూన్‌కు వెళ్లాలంటే ఎంతో ప్రణాళిక అవసరం.

ఇటీవలి కాలంలో కొత్తగా పెళ్లైన వారు చాలామంది హనీమూన్ కోసం బ్యాంకాక్‌ను ఎంచుకుంటున్నారు. ఇక్కడి ఫుకెట్ , కోహ్ సముయ్ బీచ్‌లు ఎప్పుడు కొత్త జంటలతో సందడిగా కనిపిస్తుంటాయి. ఇక్కడి క్రిస్టల్ క్లియర్ వాటర్, అద్భుతమైన ఆతిథ్యం, సౌకర్యాలు కొత్త జంటలకు జీవితాంతం జ్ఞాపకాలుగా ఉంటాయి. అలాంటి బ్యాంకాక్‌లో అద్భుతమైన హనీమూన్ ప్లాన్ కోసం ఆరు స్టెప్స్.

స్టెప్ 1: ఏడాదిలో ఏ నెలలో బ్యాంకాక్ వెళ్లాలని భావిస్తారో నిర్ణయించుకోండి. ఏడాదిలో ఎప్పుడైనా వెళ్లేలా బ్యాంకాక్ ఉంటుంది. అయితే, ప్రతి ఏటా తొలి మరియు చివరి నెలల్లో వాతావరణం చాలా బాగుంటుంది. అలాగే మీరు ఏ రకమైన ట్రిప్ ప్లాన్ చేసుకుంటారో కూడా నిర్ణయించుకోవాలి. రిలాక్సింగ్, అడ్వెంచర్ లేదా కేవలం నగరాన్ని చూడటానికి మాత్రమే వెళ్ళాలాలనుకుంటున్నారా.. నిర్ణయించుకోవాలి

స్టెప్ 2: మొదట మీ భాగస్వామితో బడ్జెట్ గురించి చర్చించండి. బ్యాంకాక్ ట్రిప్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నదిగా కనిపిస్తుంది. కానీ నిజానికి పెద్ద ఖర్చుతో కూడుకున్నది ఏమీ కాదు. ట్రిప్ కోసం బడ్జెట్‌లో భాగంగా బ్యాంకాక్‌లో షాపింగ్ చేసేందుకు కూడా బడ్జెట్ చూసుకోవాలి. ఎందుకంటే షాపింగ్‌కు బ్యాంకాక్ చాలా మంచి ప్లేస్. ట్రిప్ కోసం బడ్జెట్ పక్కాగా ప్లాన్ చేసుకోవాలి.

స్టెప్ 3: మీ టిక్కెట్స్ బుక్ చేసుకోండి. గుడ్ డీల్ కోసం మీ విమానయాన టిక్కెట్లను మూడు నాలుగు నెలల ముందుగానే బుక్ చేయాలని చాలామంది చెబుతుంటారు. అయితే, ఎయిర్ ఏషియా ద్వారా అలాంటి సౌలభ్యం ఎప్పటికీ ఉంటుంది. తమ కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్స్ ఇస్తాయి. అలాంటి ఆఫర్ ఉన్నప్పుడు మీరు టిక్కెట్ బుక్ చేసుకుంటే డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు 'సన్‌సేషనల్ సమ్మర్ సేల్' ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ ద్వారా రూ.4,499 అతి తక్కువ ధరకు టిక్కెట్ పొందవచ్చు. మీ హనీమూన్ కోసం ఎయిర్ ఏసియా ద్వారా టిక్కెట్ పొందడం మంచి ఆలోచన. ఎందుకంటే, ఇక్కడ ఆదా చేసే డబ్బును మీ ట్రిప్‌లో ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. మీ హనీమూన్ ట్రిప్‌కు మీరు ప్లాన్ చేసుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ కాకుండా ఉండేందుకు ఇది ఉత్తమ మార్గం.

స్టెప్ 4: మీరు వెళ్లడానికి కావాల్సిన సామాగ్రిని ప్యాక్ చేసుకునేందుకు జాబితా రూపొందించుకోండి. మీరు ఒకసారి టిక్కెట్స్ బుక్ చేసుకున్నారంటే.. మీరు ఎప్పుడు వెళ్లనున్నారో తెలిసిపోతుంది. అప్పుడు జాబితా సిద్ధం చేసుకోండి. పాస్‌పోర్ట్, ఐడెంటిీ ప్రూఫ్, నేషనాలిటీ ప్రూఫ్, డ్రైవర్స్ లైసెన్స్ లాంటివి ఉండాలి. మీరు ఏ నగరానికి అయితే ట్రిప్‌కు వెళ్తున్నారో ఆ నగరంలో డ్రైవింగ్ చేయాలనుకుంటే అందుకు అనుకూలమైన దుస్తులు సిద్ధం చేసుకోవాలి.

స్టెప్ 5: ఏం చేయాలో ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. మీరు స్టెప్ 1లోనే ఎలాంటి హనీమూన్ కావాలో నిర్ణయించుకున్నారు. కొందరు రిలాక్స్ కోసం హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. మరికొందరు సాహసకార్యక్రమాల కోసం ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. ఉదాహరణకు ట్రెక్కింగ్, రోప్ క్లైంబింగ్ వంటివి. మీరు నగరంలో బైక్ టూర్ వంటి వాటికి వెళ్లవచ్చు. ట్రిప్‌లో ఏమేం చేయాలో ముందే ప్లాన్ చేసుకోండి.

స్టెప్ 6: రిసార్ట్‌లను చూసుకొని బుక్ చేసుకోండి. మీరు ఏ రిసార్టులో అయితే ఉండాలనుకుంటున్నారో దాని ప్రభావం మీ ట్రిప్ పైన కచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు ఉంటే రిసార్ట్ బాగుండేలా చూసుకోండి. బ్యాంకాక్‌లో ఫైవ్ స్టార్ రిసార్ట్స్ చాలా ఉన్నాయి. అయితే, అందులో అన్ని వసతులు, మీకు అనుకూలంగా ఎందులో ఉన్నాయో చూసుకోండి. అలాగే మీ బడ్జెట్‌లో వచ్చేలా కూడా చూసుకోండి.

ఇవన్నీ అయ్యాక, ఇక మీ బ్యాగులు తీసుకొని మీరు బుక్ చేసుకున్న ఎయిర్ ఏసియా ఫ్లైట్ ద్వారా మీ అద్భుతమైన ట్రిప్‌కు సిద్ధం కండి.

ఆఫర్లతో భారత దేశంలోని బెంగళూరు, కొచ్చి, కోల్‌కతా, చెన్నై తదితర నగరాల నుంచి బ్యాంకాక్‌కు డైరెక్ట్ కనెక్టివిటీ ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్ క్యారియర్ ఎయిర్ ఏసియా. ఎయిర్ ఎసియా ఇచ్చే ఆఫర్లతో ఇంటర్నేషనల్ ఫ్లైట్ టిక్కెట్స్ ద్వారా మీరు ఎంతో డబ్బు ఆదా చేయవచ్చు. ఉదాహరణకు, ఇప్పుడు మీరు ఎయిర్ ఎసియా ఫ్లైట్స్ బుక్ చేసుకుంటే మీకు ఎంతో లాభం. ఎందుకంటే ఇప్పుడు 'సన్‌సేషనల్ సమ్మర్ సేల్' ఆఫర్ నడుస్తోంది. అంతేకాదు ఏప్రిల్ 23వ తేదీ లోగా మీరు బుక్ చేసుకుంటే రూ.4,499 అతి తక్కువ ధరకే టిక్కెట్లు పొందవచ్చు. ఆదా చేసిన డబ్బుతో ఏం చేయవచ్చో ఆలోచించండి. మీ హనీమూన్ ట్రిప్‌లో మీ భాగస్వామిని ఆశ్చర్యపరిచే బహుమతి ఇవ్వవచ్చు. కాబట్టి అలాంటి ఆఫర్లు చూడండి. హనీమూన్‌ను అద్భుతంగా అనుభవించండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+