హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పీవీ సింధు రిటైర్‌మెంట్ బాంబు? అభిమానులకు మినీ హార్ట్ స్ట్రోక్: దానికి నిరసనగా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగమ్మాయి పీవీ సింధు తన అభిమానులపై బాంబు వేశారు. కరోనా పరిస్థితుల వల్ల సామర్థ్యానికి తగ్గట్టుగా ఆడలేకపోతున్నానని వెల్లడించారు. కరోనా తీవ్రత తగ్గేంత వరకూ తాను ఎలాంటి టోర్నమెంట్లలో ఆడదలచుకోలేదని తెలిపారు. ఈ నెల 13వ తేదీన ఆరంభం కాబోయే డెన్మార్క్ ఓపెన్ తన చివరి టోర్నీ అవుతుందని స్పష్టం చేశారు. పరిస్థితులు మెరుగు పడేంత వరకూ తాను బ్యాడ్యింటన్ ఆడబోనని చెప్పుకొచ్చారు. ఊహించని పరిస్థితుల్లో ఊహించని నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. కరోనా పరిస్థితులు మెరుగుపడేంత వరకూ ఆమె బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. కనిపించని ఈ మహమ్మారి నియంత్రణలోకి వచ్చేంత వరకూ ఇకపై టోర్నమెంట్లకు దూరంగా ఉంటానని ఆమె చెప్పకనే చెప్పారు. కరోనా వైరస్ వ్యాక్తి చెందిన అనంతరం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మాత్రమే తాను తాత్కాలికంగా దూరం అవుతున్నట్లు వెల్లడించారు.

Ace Shuttler PV Sindhu announces her retirement, Fans disappointed with her decision

షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 13వ తేదీన డెన్మార్క్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ స్టార్‌గా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఆమెను ఏపీ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా నియమించింది. కరోనా వైరస్ అనంతరం బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆడే పరిస్థితులను కల్పించలేకపోవడానికి నిరసనగా ఆమె టోర్నమెంట్లకు దూరం అవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

English summary
In a surprising development that has taken sports enthusiasts by surprise, professional badminton champion PV Sindhu, who has won medals for India at Olympics and BWF gold championships, has announced her retirement
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X