వామ్మో.. వీరు మాములు దొంగలు కాదు, ఏటీఏంనే ఎత్తుకెళ్లి... రూ.40 లక్షలు చోరీ..
ఆదిలాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకంగా ఏటీఎంనే దోసుకెళ్లారు. కలెక్టరేట్ చౌక్‌లో ఏటీఎంలో చోరీకి ప్రయత్నం చేశారు. అయితే విఫలం కావడంతో కొత్తగా ప్రయత్నించారు. తాళ్లతో కట్టి మరీ ఏటీఎంను ఎత్తుకెళ్లారు. కారులో ఏటీఎంను తీసుకెళ్లారు. అక్కడ నగదును లూటీ చేశారు. ఇక ఏటీఎం ఏం అవసరం అనుకుని.. ఊరి శివారులో ఏటీఎంను వదిలివెళ్ళారు.
అంతకుముందు దేవి చంద్‌చౌక్‌లో నగల దుకాణంలో దొంగులు చోరీకి యత్నించారు. కానీ పోలీస్ పెట్రోలింగ్ వాహనం వచ్చింది. దీంతో దుండగులు అక్కడినుంచి పారిపోయారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగుల కోసం విసృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగల గురించి ఆరాతీశారు.

దొంగలు వదిలి వెళ్లిన ఏటీఎంలో రూ.30 నుంచి రూ.40 లక్షలు ఉంటాయని తెలుస్తోంది. దొంగతనం చేసింది అంతరాష్ట్ర ముఠా పని అని పోలీసులు అనుమానిస్తున్నారు. సాధారణ దొంగలు ఇలా చేయరని చెబుతున్నారు. అలాగే దొంగలు నలుగురు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారు సంచరించిన ప్రాంతంలో గల సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. అన్నీ చెక్ పోస్టులను అలర్ట్ చేశామని.. వారిని త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications