వసంత పంచమి: బాసరకు పోటెత్తిన జనం, వర్గల్‌కు కూడా.. ఏర్పాట్లపై అసంతృప్తి..
ఇవాళ వసంత పంచమి.. చదువుల తల్లి సరస్వతీకి ప్రీతికరం.. అమ్మవారి పుట్టినరోజు రోజు కావడంతో దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. తెలంగాణ రాష్ట్రంలో జ్ఞాన సరస్వతీ దేవి.. బాసరలో కొలువై ఉన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఇటు మెదక్ జిల్లా వర్గల్ సరస్వతీ క్షేత్రానికి కూడా జనం తండోపతండాలుగా వచ్చారు.

బాసరలో వసంత పంచమి
బాసర ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి . తెల్లవారు జాము ఒకటిన్నర గంటలకు మంగళవాయిద్యసేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. అమ్మవారికి చండీవాహనం, వేదపారాయణంతోపాటు మహా పూజలు నిర్వహించారు. జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాలకు అర్ధరాత్రే బాసరకు చేరుకున్న భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

పిల్లలకు అక్షరాభ్యాసం
అమ్మవారి చెంత అక్షరాభ్యాసం చేయిస్తే విద్యాబుద్ధులు దండిగా ఉంటాయని భక్తుల అపారనమ్మకం. ఇందులో భాగంగా అక్షర శ్రీకార మండపంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు ఉదయం నాలుగు గంటలకే ప్రారంభవ అయ్యాయి. అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో బాసర వాగ్దేవి.. సరస్వతి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోంది.

అమ్మవారి సేవలో ఇంద్రకరణ్ రెడ్డి
దేవాదాయశాఖ తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి దర్శనానికి మూడు క్యూలైన్లను అధికారులు సిద్ధం చేశారు. ఏటా మాఘ శుద్ధ పంచమి నాడు వసంత పంచమిని జరుపుకుంటారు. ఆ రోజు చదువుల తల్లి సరస్వతి దేవిని ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ముఖ్యంగా చాలా మంది తల్లిదండ్రులు ఈ రోజున తమ పిల్లలకు సరస్వతీ మాతా దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. ఎందుకంటే.. అమ్మవారి దగ్గర అక్షరాభ్యసం చేయించడం వల్ల పిల్లలకు విద్యాబుద్ధులు బాగా అబ్బుతాయని విశ్వసిస్తారు. వసంత పంచమి రోజు నుంచే వసంత రుతువు కూడా ప్రారంభం అవుతుంది.
Recommended Video

భక్తుల పెదవి విరుపు
ఇటు బాసరలో సరయిన ఏర్పాట్లు చేయలేదని భక్తులు అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సరయిన ఏర్పాట్లు చేయలేదని పేర్కొన్నారు. ప్రత్యేకమైన రోజులు ఏర్పాట్లు చేస్తే బాగుండేది అని కోరారు.












Click it and Unblock the Notifications