కేసీఆర్ ఆంధ్రాకు వస్తావా ...ముందు వీటికి సమాధానం చెప్పు : చంద్రబాబు షరతు..!
టిఆర్‌యస్ .. టిడిపి మధ్య మాటల యుద్దం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్ది రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అవుతున్నారు. ఇక, తాజాగా కెటిఆర్ - జగన్ సమావేశం తరువాత రెండు పార్టీల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ఏపిలో కేసీఆర్ పర్యటన ఖరారైన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు కీలక కామెంట్లు చే సారు. కేసీఆర్ ఏపికి వచ్చే ముందు వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు..

సమాధానం చెప్పు..షరుతు..
ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్, జగన్ ఫెడరల్ ఫ్రంట్‌లో కూర్చుని ఏం చెబుతారని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమకూ ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారన్నారు. విభజన చట్టంలో అంశాలు అమలు చేస్తారా.. సుప్రీం కోర్టు తీర్పు అమలు చేస్తామని చెబుతారా.. పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడకుండా ఉంటారా..ప్రత్యేక హోదాకు అడ్డుపడకుండా ఉంటారా..అని ప్రశ్నలు సంధించారు.

చంద్రబాబు తెలంగాణ లో ప్రచారం
త్వరలోనే ఆంధ్ర కు వస్తానంటున్న కేసీఆర్ వీటికి సమాధానం చెప్పాని డిమాండ్ చేసారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి ప్రచారం చేయటాన్ని ఎన్నికల సమయంలో కేసీఆర్ తప్పు బట్టారు. రాజకీయంగా పలు విమర్శలు చేసారు. నాడు చంద్రబాబు తెలంగాణ లో ప్రచారం చేయాలంటే సమాధానం చెప్పాలంటే సమాధానం చెప్పాలంటూ కొన్ని ప్రశ్నలను సంధించారు. ఇప్పుడు చంద్రబాబు సైతం అదే తరహాలో కేసీఆర్ ముందు తన ప్రశ్నలుంచారు.

హోదా పైనే కీలకం..
ఫెడరల్ ఫ్రంట్ పై చర్చల సమయంలో ఏపికి ప్రత్యేక హోదా పైనే చర్చించినట్లు వైసిపి అధినేత జగన్ చెప్పుకొచ్చారు. ఏపికి ప్రత్యేక హోదా పై కెసీఆర్ సైతం కొద్ది రోజుల క్రితం జరిగిన మీడియా సమావేశంలో తాము ఏపికి ప్రత్యేక హోదా వి షయంలో ఒకే విధానానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. అవసరమైతే ప్రధానికి లేఖ రాస్తానని స్పష్టం చేసారు. ఇక, జగన్ తో భేటీ సమయంలో టిఆర్‌యస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తాము హోదా విషయంలో స్టాంగ్ మార్చుకోలేదని స్పష్టం చేసారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే నెల 14న ఏపిలో పర్యట న దాదాపు ఖరారైంది. ఈ పరిస్థితుల్లో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు సంధించిన ప్రశ్నల పై టిఆర్‌యస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక, కేసీఆర్ ఏపి పర్యటన పై ఇప్పటికే ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications