11వ తేదీన ఏపీ మంత్రివర్గ విస్తరణ..? ఏప్రిల్ 8న గవర్నర్‌తో జగన్ భేటీ..
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణపై రోజుకో ఊహాగానాలు వస్తున్నాయి. రేపు, మాపు అని అంటున్నారు. అలాగే ఎవరూ ఉంటారో.. ఉండరో అనే అంశంపై ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి తెరపడినట్టే అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 11వ తేదీన కేబినెట్ విస్తరణ జరగనుంది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 8వతేదీన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ సమావేశం అవుతారు. మంత్రివర్గ విస్తరణ గురించి ఆయనకు తెలియజేస్తారని తెలుస్తోంది.

ఒకరోజు ముందు సమాచారం..
మంత్రి పదవీని కొత్తగా అవకాశం అందుకోనున్నవారికి ఒక రోజు ముందుగా సమాచారం అందనున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ విస్తరించిన తర్వాత.. పాత, కొత్త మంత్రులందరికీ సీఎం జగన్ విందు ఇస్తారు. తర్వాత సీఎం జగన్ తన సహచరులకు నిర్దేశం చేశారు. కేబినెట్ విస్తరణ అనేది ప్రభుత్వం ఏర్పాటు జరినప్పుడే తీసుకునే నిర్ణయం జగన్ ఇదివరకే స్పష్టంచేశారు. పదవులు పోయిన వారికి పార్టీ జిల్లా బాధ్యతలు ఇస్తామని తెలిపారు. పదవులు ఊడేవారు.. చాలా మంది కూడా తమకు ఏ బాధ్యత ఇచ్చిన.. నెరవేరుస్తామని అంటున్నారు.

అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం
పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాలని సీఎం జగన్.. ఇదివరకే చెప్పేశారు. అప్పటి నుంచి కేబినెట్ లో ఉండేదెవరు.. ఊడేదెవరు.. అనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోరుగా జరిగింది. 95 శాతం మంది మంత్రులను తప్పించి.. టీమ్‌ను జగన్ రూపొందించనున్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కొందరు తమకు పదవి పోయినా ఇబ్బంది లేదని.. జగన్ ఎలా చెబితే అలా పని చేస్తామని అంటున్నారు. కేబినెట్ విస్తరణపై ఇప్పుడు స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. సో కొత్తగా వచ్చేదెవరు.. వెళ్లేది ఎవరనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.

సరిగ్గా 2 వారాలు
2 వారాల్లో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రూపు రేఖలు మారడం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరిద్దరు సహా.. దాదాపు అందరీ పదవులు ఊడనున్నాయి. కొత్త వారికి అవకాశం ఇస్తారు. ఇప్పడు ఉన్న వారికి పార్టీ జిల్లా అధ్యక్ష పదవీ కట్టబెడతారు. అయితే వారు కూడా పదవీని వదులుకనేందుకు సిద్దంగానే ఉన్నారు. జగన్ ఏం చెబితే.. అదీ చేస్తాం అని అంటున్నారు. తమ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యం అని చెబుతున్నారు. బొత్స లాంటి సీనియర్లకు.. అనుభవానికి తగినట్టు పదవీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రభుత్వంతోపాటు.. పార్టీని కూడా సమాంతరంగా పటిష్టంగా నడపాలని జగన్ అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ మేరకు నేతలకు బాధ్యతలు ఇచ్చే ఛాన్స్ ఉంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications