అమరావతి కేంద్రంగా హైకోర్టు : న‌్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం..

కొత్త సంత్సరం ప్రారంభం రోజునే అమరావతి కేంద్రంగా ఏఉపి హైకోర్టు విధులు ప్రారంభమయ్యాయి. హైకోర్టు విభజన తరువాత ఏపి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ తో పాటు ఏపికి కేటాయించిన 13 మం ది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేసారు. విజయవాడలో తాత్కాలిక హైకోర్టును ఏర్పాటు చేసారు...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసారు. గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఆంధ్ర ప్రదేశ్ న్యాయస్థానం
రాష్ట్ర విభజన తర్వాత నాలుగు న్నారేళ్లకు... సీమాంధ్ర గడ్డపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ప్రారంభమైంది. విజయవాడ నడిబొడ్డున ఉన్న సీఎం క్యాంపు కార్యాలయంలోనే కొన్నాళ్ల పాటు హైకోర్టు కార్యకలాపాలు జరుగనున్నాయి. ఇందులో 9 కోర్టుహాళ్లు సిద్ధం చేశారు. మరో హాలును మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌కు కేటాయించిన న్యాయమూర్తులకు ప్రముఖ హోటళ్లు, స్టేట్ గెస్ట్‌హౌస్‌లో వసతి ఏర్పాటు చేశారు. సిబ్బంది నాలుగు బస్సులలో విజయవాడకు వచ్చేశారు. ఇప్పటికే సంబంధిత ఫైళ్లు అన్నీ విజయవాడకు చేర్చారు.

70 శాతం కేసులు ఏపివే..
ఉమ్మడిహైకోర్టులో 3.4లక్షల వ్యాజ్యాలు ఉండగా.. అందులో 70శాతం వరకు కేసులు ఏపీకి చెందినవే. ఏపీ హైకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల పోస్టులు 37 కాగా... ప్రస్తుతం ఉన్న వారు 14 మంది. ప్రధాన న్యాయమూర్తితో పాటుగా ఏపి కి కేటాయించిన 13 మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేసారు. జస్టిస్ వెంకట నారాయణభట్టి , జస్టిస్ వెంకట శేషసాయి ,జస్టిస్ సీతారామమూర్తి ,జస్టిస్ దుర్గా ప్రసాదరావు, జస్టిస్ సునీల్‌చౌదరి, జస్టిస్ సత్యనారాయణమూర్తి ,
జస్టిస్ శ్యాంప్రసాద్ ,జస్టిస్ ఉమాదేవి, జస్టిస్ బాలయోగి, జస్టిస్ రజని, జస్టిస్ సుబ్రహ్మణ్య సోమయాజులు, జస్టిస్ విజయ లక్ష్మి, జస్టిస్ గంగారావు లు ప్రమాణ స్వీకారం చేసారు. సంక్రాంతి సెలవుల తరువాత పూర్తి స్థాయిలో హైకోర్టు కార్యకలాపా లు ప్రారంభం కానున్నాయి.