ఏపీ నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు: 16 రెవెన్యూ డివిజన్లలో పోలింగ్.. పోలీస్ నీడన..
మరికొన్ని గంటల్లో ఏపీలో చివరి విడత పంచాయతీ ఎన్నికల జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని పంచాయతీశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లు, 161 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
నాలుగో దశ పంచాయతీ ఎన్నికల కోసం 28,995 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 6,047 సమస్యాత్మక, 4,967 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు గుర్తించామని పేర్కొన్నారు. కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాటు చేశామని.. సెంటర్ల దగ్గర వీడియోలో రికార్డు చేస్తున్నామని ద్వివేది తెలిపారు. తుది దశ కూడా ప్రశాంతంగా నిర్వహిస్తామని పోలీసులు ధీమాతో ఉన్నారు.

నాలుగో విడత గుంటూరు డివిజన్ పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాలు పతాక స్థాయికి చేరాయి. ఆదివారం పోలింగ్ నేపథ్యంలో తాయిలాల పంపిణీకి తెరలేపారు. మద్యం, నగదుతోపాటు ప్రత్యేక తాయిలాలు కూడా అందజేసేందుకు నాయకులు సిద్ధమయ్యారు. మిగిలిన డివిజన్లకు భిన్నంగా ఇక్కడ పలు పంచాయతీల్లో అధికారపార్టీకి ధీటుగా ప్రతిపక్షాలు బలపరిచిన అభ్యర్థులు పోటీలో నిలిచారు. దీంతో ఇక్కడ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. గెలుపుకోసం అభ్యర్థులు మద్యం, డబ్బు, గిఫ్ట్‌లు, పలావు పాకెట్లు పంచుతున్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications