ఏపీలో ముందస్తు..? వ్యతిరేకతను తప్పించుకోవడానికే.. చంద్రబాబు హాట్ కామెంట్స్

ఇప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేవు. సమయం ఉంది. తెలంగాణలో ఏడాది కాగా.. ఏపీలో ఎక్కువే ఉంది. కానీ పరిస్థితి మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. అవును తెలంగాణలో కేసీఆర్ పర్యటనలు.. ఏపీలో చంద్రబాబు కామెంట్స్ చర్చకు దారితీస్తున్నాయి. దీంతో ముందస్తు ఎన్నికలకు వెళతారా అనే సందేహాం కలుగుతుంది. తెలంగాణలో ఇప్పటికే ఒకసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. మరీ ఏపీలో కూడా జగన్ అలానే ఆలోచిస్తున్నారని చంద్రబాబు కామెంట్స్ చేస్తున్నారు.

 నెత్తి మీద కుంపటి..

నెత్తి మీద కుంపటి..

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. నెత్తి మీద కుంపటిని దించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. రేపో ఎల్లుండో సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఇప్పటివరకు అధికార పార్టీ అలా చెప్పలేదు. తమ పని తాము చేసుకొని వెళుతుంది. కానీ చంద్రబాబు మాత్రం భిన్నంగా స్పందించారు. అధికార పార్టీ ఏం చేయబోతుందో తెలియజేశారు. కానీ అదీ నిజం అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.

 వ్యతిరేకత వస్తోంది..

వ్యతిరేకత వస్తోంది..


మరిన్ని రోజులు గడిస్తే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని సీఎం జగన్ భయపడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమని చంద్రబాబు అన్నారు. అంటే చంద్రబాబు తన మనసులోని మాటను బయటపెట్టారు. తప్ప సీఎం జగన్ ఎక్కడ ఇండికేషన్ ఇవ్వలేదు. సీఎం జగన్ పక్కా బిజినెస్ మ్యాన్ అని, ప్రతి రోజూ ఎంత సంపాదించామోనని గల్లా పెట్టే చూసుకుంటూ ఉంటారని చంద్రబాబు ఆరోపించారు.

మహిళలపై ఇలానా..?

మహిళలపై ఇలానా..?

మహిళల క్యారెక్టర్‌ను దెబ్బ కొట్టడం వైసీపీ పనిగా పెట్టుకుందని చంద్రబాబు ఆరోపించారు. ఇదీ మంచి పద్దతి కాదని సూచించారు. అసెంబ్లీలో తన భార్యను కించపరిచారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ బతికి ఉన్న సమయంలో కానీ.. ఇప్పుడు కానీ.. భువనేశ్వరి ఎప్పుడైనా రాజకీయాల్లో కన్పించారా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. అలాంటి వారిని కామెంట్ చేయడం ఏంటీ అని అడిగారు. లేనిది ఊహించుకోని.. సభలో వ్యాఖ్యానించడం మంచి పద్దతి కాదన్నారు. దానిని జనం చూశారని.. తగిన బుద్ది చెబుతారని తెలిపారు. ప్రభుత్వ చర్యలను విపక్షాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+