అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లేఖాస్త్రం: ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ, అక్రమాలపై వివరణ

|
Google Oneindia TeluguNews

మరికొద్ది గంటల్లో ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ అక్రమాలపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ రాజీలేని పోరాటం చేస్తోంది. అక్రమాలను టీడీపీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొస్తోంది. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీనికి సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు లేఖ రాశారు.

పంచాయతీ పోరు: మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అరెస్ట్.. శ్రేణుల ఆందోళన...పంచాయతీ పోరు: మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అరెస్ట్.. శ్రేణుల ఆందోళన...

పుంగనూరు, మాచర్ల నియోజకవర్గాలలో అధికార వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పోటీ చేయాలనుకునే అభ్యర్ధులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. మాచర్ల, పుంగనూరులో పంచాయతీ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని లేఖలో కోరారు. స్థానిక ఎమ్మార్వో, ఎంపీడీవో, పోలీసులను బదిలీ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

chandrababu writes letter to sec

అధికార పార్టీకి అధికారులు సలాం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీంతో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడం లేదని చెప్పారు. తాము చెప్పినా చోట తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. తమ వినతిని ఎస్ఈసీ పరిశీలించాలని విన్నవించారు. పంచాయతీ ఎన్నికలను అక్రమాలకు తావులేకుండా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

ఏపీలో పంచాయతీ పోరు మూడు విడతల్లో జరగనున్న సంగతి తెలిసిందే. బరిలో ప్రముఖులు నిలిచారు. పంచాయతీ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ హింట్ ఇచ్చారు. ఎన్నికల కోడ్ కంటిన్యూ అవుతుందని స్పష్టత ఇచ్చారు. కానీ అధికార ప్రకటన మాత్రం వెలువడలేదు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ మార్చి 31వ తేదీతో ముగియనుంది. ఆ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారు. కానీ అధికార వైసీపీ మాత్రం అందుకు సముఖుంగా లేదు. పంచాయతీకి అయిష్టంగానే బరిలోకి దింపింది. మరీ జడ్పీ ఎన్నికలు ఎలా జరుగుతాయో చూడాలి మరీ.

English summary
tdp chief chandrababu naidu write letter to sec on panchayat elction
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X