రెండు కోట్ల ఓటర్ల పై బాబు గురి : ప‌్ర‌భుత్వ ల‌బ్ది దారులంతా టిడిపి ఓట‌ర్లేనా:జ‌గ‌న్ - ప‌వ‌న్ ప్లాన్

ఏపిలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ‌రాలు కురిపిస్తున్నారు. సెంటిమెంట్ పండిస్తున్నారు. ప్ర‌భుత్వ ప‌ధ‌కాల ల‌బ్దిదారులంతా టిడిపి ఓట‌ర్లుగా భావిస్తున్నారు. అంత‌టితో ఆగ‌టం లేదు.. మీకు ల‌బ్డి కొన‌సాగాలంటే తిరిగి తాను ముఖ్య‌మంత్రి కావాల‌ని చెబుతున్నారు. లేకుంటే ప‌ధ‌కాలు ఆగిపోతాయ‌ని..అంతా ఆరాచ‌క‌మేని ప‌రోక్షంగా హెచ్చ‌రిస్తున్నారు. ల‌బ్ది దారులు పార్టీ జెండా క‌ట్టాల‌ని సూచిస్తున్నారు. మ‌రి..ప్ర‌భుత్వం సొమ్ముతో పార్టీ ప్ర‌యోజ‌నాల‌ను ర‌క్షించుకుంటున్నారా అనే చ‌ర్చ మొద‌లైంది. మరి..ఈ ఓట్ల‌న్నీ త‌మ‌వే అని టిడిపి చెబుతోంది. జ‌గ‌న్..ప‌వ‌న్ పార్టీల‌కు దీని వ‌ల‌న న‌ష్ట‌మేనా..ఏం చేయ‌నున్నారు..

ద్విముఖ వ్యూహంతో బాబు..

ద్విముఖ వ్యూహంతో బాబు..

2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు త‌న ప‌ధ‌కాలే త‌న‌ను గెలిపిస్తాయ‌నే న‌మ్మకంతో ఉన్నారు. రాష్ట్రంలోని రెండు కోట్ల ఓట‌ర్ల ను ల‌క్ష్యంగా చేసుకొని ముందుకు వెళ్తున్నారు. ప్ర‌భుత్వ ప‌ధ‌కాల ల‌బ్దిదారులంతా త‌మ‌కే ఓటు వేస్తార‌ని..వారు అలా వేసేలా చేయాల‌ని నిర్ధేశిస్తున్నారు. ఇందుకోసం సెంటిమెంట్ పండిస్తున్నారు. ప‌ధ‌కాలు తాము తిరిగి అధికారంలోకి వ‌స్తేనే కొన‌సాగుతాయ‌ని టిడిపి నేత‌లు విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. తాము అధికారంలోకి రాక‌పోతే ఏపి అభివృ ద్ది ఆగిపోతుందని హెచ్చ‌రిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఏ విధంగా అయితే అధికార మార్పిడి జ‌రిగితే తెలంగాణ‌కు న‌ష్ట‌మ‌ని ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారో..అదే బాట‌ను చంద్ర‌బాబు ఎంచుకున్నారు. దీని కోసం ఏపి ఖ‌జానాలో డ‌బ్బులు లేక‌పోయినా..పోస్ట్ డేట్ చెక్కులు ఇచ్చి ఎన్నిక‌ల ముందు త‌మ‌ను గుర్తు చేసుకొనేలా వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డలు వేస్తున్నారు. ప్ర‌తిప‌క్ష నేత ఇచ్చిన హామీల‌ను ముందుగానే అమ‌లు చేసి..వాటికి విలువ లేకుండా చేయ టం ఈ వ్యూహంలో మ‌రో భాగం.

రెండు కోట్ల ఓట‌ర్ల పై బాబు గురి..

రెండు కోట్ల ఓట‌ర్ల పై బాబు గురి..

ఏపిలో దాదాపు మూడు కోట్ల మంది ఓట‌ర్ల ఉన్నారు. ప్ర‌తీ కుటుంబం ఏదో ర‌కంగా ప్ర‌భుత్వ సంక్షేమ ప‌ధ‌కాల్లో ఒక దాని ద్వారా ప్ర‌యోజ‌నం పొందుతుంది. ఇందులో క‌నీసం రెండు కోట్ల మంది ఓట‌ర్ల‌ను త‌మ ప‌ధ‌కాల ద్వారా త‌మ వైపు మ‌ళ్లేలా చేయాల‌ని అధికార పార్టీ ప్ర‌య‌త్నం. డ్వాక్రా సంఘాల స‌భ్యులు 94 ల‌క్ష‌ల మంది, సామాజిక పెన్ష‌నర్లు 54 ల‌క్ష‌ల మంది ఉన్నారు. టిడిపి కార్య‌క‌ర్త‌లు 65 ల‌క్ష‌ల మంది ఉండ‌గా,, రైతుల‌కు ఇవ్వ‌బోయే వ‌రం ద్వారా రైతులు త‌మ‌కు ద‌గ్గ‌ర‌వుతార‌ని భావిస్తున్న ప్ర‌భుత్వం..తాము తీసుకొనే ప్ర‌తీ నిర్ణ‌యంలోనూ ఓట్ల లెక్క‌లు చూస్తోంది. తాజాగా ఆటో డ్రైవ‌ర్ల‌కు లైఫ్ టాక్స్ ర‌ద్దు చేసారు. వారితో సైతం చంద్ర‌బాబు ఇదే విష‌యాన్ని చెప్పుకొచ్చారు. 75 రోజులు క‌ష్ట‌ప‌డాల‌ని..ప్ర‌తీ ఆటోకు టిడిపి జెండా క‌ట్టాల‌ని సూచించారు. ప్ర‌తీ ఆటో వెనుక థాంక్యూ సీయం సార్ అని బోర్డులు పెట్టుకోవాల‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. రాష్ట్రంలో 3.70 ల‌క్ష‌ల ఆటోలు ఉన్నాయ‌ని..వారి ఓట్లు త‌మ‌కే అంటూ లెక్క‌లు క‌డుతున్నారు. ప్ర‌భు త్వ సొమ్ముతో ప‌ధ‌కాల‌ను అమ‌లు చేస్తూ..ల‌బ్ది దారులంతా త‌మ‌కే ఓటు వేసేలా మ‌ల‌చుకోవ‌ట‌మే ఇప్పుడు టిడిపి అమలు చేస్తున్న అస‌లు సిస‌లు ఎన్నిక‌ల మేనేజ్‌మెంట్‌.

జ‌గ‌న్..ప‌వ‌న్ పార్టీల‌కు న‌ష్ట‌మేనా..!

జ‌గ‌న్..ప‌వ‌న్ పార్టీల‌కు న‌ష్ట‌మేనా..!

ప్ర‌భుత్వ సంక్షేమ ప‌ధ‌కాల ల‌బ్దిదారులంతా త‌మ ఓట‌ర్లుగా భావిస్తూ..వారి ఓట్లు త‌మ‌కే ప‌డేలా మేనేజ్ చేయాల‌ని భావి స్తున్న టిడిపికి ధీటుగా ఇప్పుడు వైసిపి - జ‌న‌సేన అధినేత‌లు ఏం చేస్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది. దాదాపుగా ఒంట రి పోరుకు సిద్ద‌మైన టిడిపి ఎలాగైనా గెల‌వాల‌నే ల‌క్ష్యంతో వ‌రాలు ప్ర‌క‌టిస్తోంది. అయితే జ‌గ‌న్ త‌న హామీల‌నే సీయం కాపీ కొడుతున్నార‌ని ఆరోపిస్తున్నారు. చంద్ర‌బాబు ఏం చెప్పినా..ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌నే ధీమా జ‌గ‌న్ లో వ్య‌క్తం అవుతోంది. ప‌వ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి హామీలు ఇవ్వ‌టం లేదు. ఎన్నిక‌ల మేనిఫెస్టోలేనే ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. మ‌రి.. ప్ర‌భుత్వ ల‌బ్దిదారులంతా త‌మ‌కే ఓటు వేస్తారు..వేయాలి అనే విధంగా టిడిపి అమ‌లు చేస్తున్న వ్యూహాల‌కు ధీటుగా ఈ ఇద్ద‌రు త‌మ పార్టీల‌కు అనుకూలంగా ఓట‌ర్ల‌ను ఎలా మ‌ల‌చుకుంటార‌నేది ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప్ర‌భావం చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+