ఆంద్ర‌ప్ర‌దేశ్ పేరు అంటేనే మోదీకి అలెర్జీ..! ఘాటుగా విమ‌ర్శించిన చంద్ర‌బాబు..!!

Recommended Video

    Modi Did Not Do Anything For AP Says Chandrababu Naidu | Oneindia Telugu

    అమరావతి : ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, రాష్ట్రానికి వందల సంఖ్యలో అవార్డులు వస్తున్నాయి, ఇది చూసి ఓర్వలేక ఏపీపై అసూయ పెంచుకుంటున్నారని ముఖ్యమంత్ర చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ నాయ‌కుల‌తో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు కేంద్ర బీజేపి పైన లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు తెలుస్తోంది.

    ఏపీ పురోగతి చూసి కేంద్ర నాయ‌కులు భరించలేకపోతున్నారని, ఆంధ్రప్రదేశ్ పేరు వింటేనే వారిలో ఒక‌ర‌క‌మైన ప్ర‌కంప‌న‌ల‌కు పెరిగిపోతున్నాయ‌ని, అడుగడుగునా కక్ష సాధిస్తున్నారని బాబు ఆవేద‌న వ్య‌క్తం చేసారు. చివరికి వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా చేస్తున్నారని ప్రధాని మోడీని ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు.

    Modi allergy on AP..! Babu strongly criticized..!!

    ప్రధాని మోడీ నైరాశ్యంలో ఉన్న‌ట్టు కనిపిస్తోందని, హుందాతనం వదిలేసి అస‌హ‌నంతో, అసూయ‌తో ఆంద్ర ప్ర‌దేశ్ మీద నిందలు వేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. మోడీ త‌న‌ కుటుంబం గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఇది అందరూ ఊహించిందే అన్నారు. చెప్పుకోవడానికి మోడీ ఆంద్ర ప్ర‌దేశ్ కి చేసిందేమీ లేదని అందుకనే ఇటువంటి చౌక‌బారు వ్య‌క్తిగ‌త వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

    చివరికి ఏపి శకటం పైన కూడా ఆంక్ష‌లు విధిండం భాదాక‌ర‌మ‌ని తెలిపారు. రిపబ్లిక్ డే కు ఏపి శకటం లేకుండా చేస్తున్నారని, ఇది కేంద్రంలో బిజెపి కక్షసాధింపునకు పరాకాష్టని ఆగ్రహం వ్యక్తం చేశారు. శకటం ప్రదర్శనకు అనుమతి ఇవ్వక పోవడంపై కేంద్రానికి లేఖ రాసి వారు అనుసరిస్తున్న వివక్షతను బహిర్గతం చేయాస్తామని ఏపీ సీయం చంద్రబాబు హెచ్చరించారు. కేంద్ర క‌క్ష‌పూరిత రాజ‌కీయాలు ఇత‌ర రాష్ట్రాలు గ‌మనించాల‌ని బాబు విజ్ఞ‌ప్తి చేసారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+