అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీనియ‌ర్స్ వ‌ర్సెస్ జూనియ‌ర్స్..! ఏపి రాజ‌కీయం ర‌స‌కందాయం..!!

|
Google Oneindia TeluguNews

విజయవాడ/హైద‌రాబాద్ : సాధార‌ణ ఎన్నికలు స‌మీపిస్తున్నాయి. దీంతో ఏపీలోని రాజకీయ సమీకరణాల కూడా శ‌ర‌వేగంగా మారుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా బరిలోకి దిగుతున్నారు పార్టీ నేతలు. కాగా వైసీపీ నుంచి ఎక్కువగా రాజకీయాలకు కొత్త అభ్యర్థులను బరిలో నిలపగా తెలుగుదేశం పార్టీ మాత్రం హేమాహేమీల్లాంటి అభ్యర్థులను పార్లమెంటు ఎన్నికల బరిలో నిలిపింది. దీంతో సర్వేలు నిజమవుతాయా లేదా అన్న అనుమానం లేక పోలేదు. వైసీపీ నుంచి ఎన్నికల బరిలో దిగే వాళ్లు అందరూ కూడా చాలా వ‌ర‌కు కత్త వాళ్లే కావ‌డం విశేషం. దీంతో ఏపిలో పోటీ జూనియ‌ర్స్ వ‌ర్సెస్ సీనియ‌ర్స్ అన్న చందంగా మారింది.

ప్రియాంకా గాంధీ పై స్మృతీ ఇరానీ ఫైర్.. మాజీ ప్రధాని శాస్త్రిని ప్రియాంక అవమానించారట ప్రియాంకా గాంధీ పై స్మృతీ ఇరానీ ఫైర్.. మాజీ ప్రధాని శాస్త్రిని ప్రియాంక అవమానించారట

టీడిపిలో అనుభ‌వం ఉన్న నేత‌లు..! వైసీపిలో కొత్త ముఖాలు..ఏపి లో ఆస‌క్తిక‌ర పోటీ..!!

టీడిపిలో అనుభ‌వం ఉన్న నేత‌లు..! వైసీపిలో కొత్త ముఖాలు..ఏపి లో ఆస‌క్తిక‌ర పోటీ..!!

అనంతపురం జిల్లాలోని అనంతపురం పార్లమెంటు నుంచి రాజకీయాలకు కొత్త అయిన, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పీడీ రంగయ్య వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి ఆయనపై జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇదే జిల్లాలోని మరో నియోజకవర్గం హిందూపురం నుంచి వైసీపీ తరపున మ���జీ సీఐ గోరంట్ల కేశవ్ కు టిక్కెట్ ఇచ్చారు. ఆయనపై టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ, సీనియర్ నేత నిమ్మల కిష్టప్ప పోటీ చేస్తున్నారు. ఇది పరిశీలిస్తే రాజకీయంగా వైసీపీ అభ్యర్థుల కంటే టీడీపీ అభ్యర్థులు బలమైన వారుగా ఉన్నారు. ఇక కడప, రాజంపేట, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు సమాన స్థాయి వారు ఉన్నారు.

కొత్త పాత క‌ల‌యిక..! ఏపి రాజ‌కీయాలు ఆసాంతం ఆస‌క్తిక‌రం..!!

కొత్త పాత క‌ల‌యిక..! ఏపి రాజ‌కీయాలు ఆసాంతం ఆస‌క్తిక‌రం..!!

గుంటూరు జిల్లాలోని బాపట్ల పార్లమెంటు స్థానానికి వైసీపీ తరపున సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు నందిగం సురేష్ ను పోటీలో నిలిపారు. ఆయనపై టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ మాల్యాద్రి పోటీలో ఉన్నారు. నరసరావుపేట నుంచి వైసీపీ తరపున యువకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు బరిలో ఉన్నారు. ఆయన రాజకీయాలకు కొత్త. ఆయనపై జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు పొందిన సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంభశివరావు పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థుల కంటే రాజకీయంగా ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు అనుభవజ్ఞులు, బలవంతులుగా కనిపిస్తున్నారు.

నువ్వానేనా అన్న‌ట్టు సాగుతున్న రాజ‌కీయాలు..! క్రిష్ణ జిల్లాలో టెన్ష‌న్ టెన్ష‌న్..!!

నువ్వానేనా అన్న‌ట్టు సాగుతున్న రాజ‌కీయాలు..! క్రిష్ణ జిల్లాలో టెన్ష‌న్ టెన్ష‌న్..!!

విజయవాడలో టీడీపీ తరపున సీనియర్ నేత క���శినేని నాని పోటీ చేయగా..ఆయనపై వైసీపీ నుంచి వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఈయన ఆర్థికంగా బలంగానే ఉన్నా రాజకీయాలకు కొత్త. ఏలూరులో సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబు టీడీపీ నుంచి పోటీలో దిగుతుంటే ఆయనకు పోటీగా వైసీపీ నుంచి రాజకీయాల్లోకి కొత్త అయిన కోటగిరి శ్రీధర్ పోటీ చేస్తున్నారు. దీంతో ఈ ఇద్దరు వైసీపీ కొత్త అభ్యర్థులు తలపండిన టీడీపీ అభ్యర్థులను ఢీకొట్టగలరా అనే అనుమానాలు వస్తున్నాయి. అమలాపురం పార్లమెంటుకు వైసీపీ నుంచి చింతా అనురాధ పోటీ చేయగా..ఆమెపై టీడీపీ నుంచి మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్ పోటీ చేస్తున్నారు. అరకు పార్లమెంటు నుంచి వైసీపీ గొడేటి మాధవి పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి మాజీ కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ బరిలో ఉన్నారు.

చాలా చోట్ల వైసీపి అనుభ‌వ రాహ‌త్యం..! ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి..!!

చాలా చోట్ల వైసీపి అనుభ‌వ రాహ‌త్యం..! ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి..!!

విశాఖపట్నం నుంచి వైసీపీ ఎంవీవీ సత్యనారాయణ పోటీ చేయగా, ఆయనపై టీడీపీ నుంచి భరత్ పోటీ చేస్తున్నారు. ఈయన రాజకీయాలకు కొత్తే అయినా ఆయన తాత ఎంవీవీఎస్ మూర్తికి ఈ ప్రాంతంలో మంచి గుర్తింపు ఉంది. బాలకృష్ణ అల్లుడు కావడం కూడా ఆయనకు మేలు చేసే అవకాశం ఉంది. ఇక, విజయనగరం నుంచి టీడీపీ తరపున రాజకీయ దిగ్గజం, మాజీ కేంద్రమంత్రి అశోకగజపతి రాజు పోటీ చేస్తుండగా వైసీపీ తరపున బెల్��ాని చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. శ్రీకాకుళంలో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ, ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు పోటీ చేయగా.. వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. ఇలా పదికి పైగా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరపున బలమైన అభ్యర్థులు బరిలో ఉండగా వైసీపీ తరపున రాజకీయాలకు కొత్త వారు పోటీ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో ప‌లు స‌ర్వేలు చెప్పే విధంగా 20కి పైగా ఎం��ీ స్థానాలను వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఏ మేర ఉన్నాయో చూడాలి.

English summary
New candidates from the YCP have been in the fray for most of the politicians, while the TDP has fielded candidates like seniors in the parliamentary election. This did not mean that surveys are true or not. Most of the people who are in the fray from the YSRCP are new. In AP, the competition became junior vs. seniors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X