పెళ్లి పేరుతో హీరో ఫీజులు ఎగిరిపోయాయి, సంధ్యా దెబ్బతో సరిగమపదనిస !
చెన్నై/విజయవాడ/బెంగళూరు: మంచి ఉద్యోగం చేస్తున్న యువకుడు వయసు మీద పడుతున్నా పెళ్లికాలేదని విచారంతో ఉన్నాడు. ఇదే సమయంలో మ్యాట్రీమోనీలో ఓ యువతి పరిచయం అయ్యింది. ఇద్దరూ తెలుగు వాళ్లు కావడంతో పెళ్లి చేసుకుందామని మాట్లాడుకున్నారు. పెళ్లికి అంగీకరించిన యువతికి ఆ యువకుడు లక్షలు లక్షలు డబ్బులు ఖర్చు చేశాడు. పెళ్లి చేసుకోవాలని డేట్ ఫిక్స్ చేసుకుందామని అనుకుంటున్న సమయంలో ఆ యువకుడికి ఫీజులు ఎగిరిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన అశోక్ చైతన్యా అనే వ్యక్తి చెన్నై చేరుకుని అవడి పక్కనే ఉన్న ఆయప్పక్కంలో నవాసం ఉంటూ ఓ ప్రైవేట్ కాల్ సెంటర్‌లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అశోక్ చైతన్యాకు 33 ఏళ్లు అయినా పెళ్లి కావడం లేదని బాధపడ్డాడు. పెళ్లి సంబంధాలు ఎన్ని చూసినా అతని వివాహం మాత్రం జరగలేదు. తల్లిదండ్రుల సూచనల మేరకు తెలుగు మ్యాట్రిమోనీలో అశోక్ చైతన్యా అతని ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేశాడు.

అదే వెబ్‌సైట్ నుండి అశోక్ చైతన్యాకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వెంకట్రామన్ కూతురు శ్రావణ సంధ్యా అనే పేరుతో మెసేజ్ లు రావడంతో ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆసందర్భంలో సంధ్యా ఆమె ఫోటో అంటూ ఓ సినీ నటి ఫోటోను అశోక్ చైతన్యాకు పంపింది. సంధ్యా పంపించిన ఫోటో అందానికి అశోక్ చైతన్యా మైమరచిపోయాడు. అబ్బా నాకు కత్తిలాంటి ఫిగర్ భార్యగా వస్తోందని అశోక్ చైతన్యా పల్లీలు కొట్టాడు.
అశోక్ చైతన్యా కూడా అతని ఫోటో సంధ్యాకు పంపించాడు. నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని అశోక్ చైతన్యాకు సంధ్యా మాట ఇచ్చింది. తరువాత అశోక్ చైతన్యా, సంధ్యా ఫోన్లలో గంటలు గంటలు మాట్లాడుకున్నారు. సంధ్యా అడిగినప్పుడల్లా అశోక్ చైతన్యా ఆమెకు డబ్బులు పంపించాడు. అశోక్ చైతన్యా బలహీనతను గుర్తించిన సంధ్యా అతన్ని ఇంతకాలం ఇష్టం వచ్చినట్లు రుబ్బేసింది.

ఇలా పలు దఫాలుగా అశోక్ చైతన్యా తనకు కాబోయే భార్య కదా అంటూ ఇప్పటి వరకు రూ.9 లక్షలు డబ్బుతో పాటు రూ. 65 వేల విలువైన సెల్ ఫోన్ కొనుగోలు చేసి ఆమెకు పంపించాడు. ఇంతకాలం బాగానే మాట్లాడిన సంధ్యా పెళ్లి డేట్ ఫిక్ చేసుకుందామని అశోక్ చైతన్యా చెప్పడంతో ఆమె కొంతకాలం ఆగుదామని, తరువాత పెళ్లి చేసుకుందామని ఇంత వరకు కాలం గడుపుతూ వచ్చింది.
చివరికి పెళ్లి విషయం గురించి అశోక్ చైతన్యా గట్టిగా సంధ్యాను ప్రశ్నించాడు. ఆ సమయంలో నేను నిన్ను పెళ్లి చేసుకోనని సంధ్యా అశోక్ చైతన్యాకు చెప్పింది. పెళ్లికి సంధ్యా నిరాకరించడంతో అశోక్ చైతన్యాకు అనుమానం వచ్చింది. ఇదే సందర్భంలో అశోక్ చైతన్యా పదేపదే పెళ్లి చేసుకోవాలని బలవంతం చెయ్యడంతో సంధ్యా అతని ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసింది.
దీంతో ఇంకా అనుమానం వచ్చిన అశోక్ చైతన్యా చెన్నైలోని ఆవడి పోలీస్ కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. అశోక్ చైతన్యా ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా బెంగళూరులోని ఓ లేడీస్ పీజీలో (అమ్మాయిల వసతి గృహం)లో తలదాచుకున్న శ్రావణ సంధ్యాను పట్టుకున్నారు.
పోలీసుల ఎంట్రీతో సంద్యా షాక్ అయ్యింది. సంధ్యాను అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకువచ్చారు. సంధ్యా చాలా మందిని ఇలాగే పెళ్లిపేరుతో మోసం చేసిందని, ఆమె పెద్ద కిల్లాడి రాణి అని పోలీసుల విచారణలో తేలింది. సంధ్యా పెళ్లికాని వృద్ధులను కూడా టార్గెట్ చేసి మోసం చేసిందని చెన్నై సిటీ పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
బెంగళూరులో సంధ్యాను అరెస్టు చేశామని, పలువురిని మోసం చేసి డబ్బు సంపాధించిన ఆమె విలాసవంతమైన జీవితం గడుపుతున్నదని, ఆమె బస చేసిన గదిలో 1 ల్యాప్‌టాప్, 3 సెల్ ఫోన్లు, 6 సిమ్ కార్డులు, క్రెడిట్, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని చెన్నై సిటీ పోలీసులు తెలిపారు. సంధ్యా మోసానికి ఉపయోగించిన ఎనిమిది ఈ-మెయిల్స్ ఐడీలు, టెలిగ్రామ్ లింక్ లను చెన్నై సిటీ పోలీసులు బ్లాక్ చేశారు.
బెంగళూరులో చాలా మంది వివాహిత పురుషులను సంధ్యా ఇలాగే మోసం చేసిందని విచారణలో తేలిందని పోలీసులు అన్నారు. దీంతో పోలీసులు సంధ్యాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. శ్రావణ సంధ్యా దెబ్బకు డబ్బులు, ఖరీదైన వస్తువులు పోగొట్టుకున్న వారి వివరాలను కూడా చెన్నై సిటీ పోలీసులు సేకరిస్తున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications