ఏపీలో 10వేలకుపైగా కరోనా కేసులు: 2 లక్షలకు చేరువలో, ఆ మూడు జిల్లాల్లో అత్యధికం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి 10వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 63,686 నమూనాలను పరీక్షించగా.. 10,328 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,96,789కి చేరింది.

82వేలకుపైగా యాక్టివ్ కేసులు

82వేలకుపైగా యాక్టివ్ కేసులు

ప్రస్తుతం రాష్ట్రంలో 82,166 యాక్టివ్ కేసులున్నాయి. 1,12,870 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 8516 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 22,99,332 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తాజాగా 72 మరణాలు, జిల్లాల వారీగా..

తాజాగా 72 మరణాలు, జిల్లాల వారీగా..

తాజాగా, కరోనాతో 72 మంది మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 1753కి చేరింది. అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో 10 మంది, గుంటూరు జిల్లాలో 9 మంది, చిత్తూరులో 8 మంది, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఆరుగురు, విశాఖపట్నం జిల్లాలో నలుగురు, కడప, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున కరోనాబారిన పడి మరణించారు.

ఆ మూడు జిల్లాల్లోనే అత్యధిక కేసులు

ఆ మూడు జిల్లాల్లోనే అత్యధిక కేసులు

అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి 1351 కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లా నుంచి 1285 కేసులు, అనంతపురం జిల్లా నుంచి 1112 కేసులు నమోదయ్యాయి. మిగితా జిల్లాల్లో కేసులు గమనించినట్లయితే.. చిత్తూరులో 755, గుంటూరులో 868, కడపలో 604, కృష్ణాలో 363, నెల్లూరులో 788, ప్రకాశంలో 366, శ్రీకాకుళంలో 682, విశాఖపట్నంలో 781, విజయనగరంలో 575, పశ్చిమగోదావరిలో 798 కరోనా కేసులు నమోదయ్యాయి.

Recommended Video

    KCR ఫామ్ హౌస్ వదిలిపెట్టి రాలేదు, అవన్నీ ఎవరు అడగరు ! - బట్టి విక్రమార్క
    దేశంలో 20లక్షలకు చేరువలో..

    దేశంలో 20లక్షలకు చేరువలో..

    కాగా, భారతదేశంలో ఇప్పటి వరకు 19,97,233 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 6,03,011 యాక్టివ్ కేసులున్నాయి. 13,52,667 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 41,101 మంది కరోనా బారినపడి మరణించారు. దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, తర్వాత ఏపీలోనే అత్యధిక కేసులున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+