బాలికపై రెండేళ్లు రేప్: స్కూల్ డైరెక్టర్‌కు పదేళ్లు జైలు

2010 జులైలో బాలికపై సలావుద్దీన్ అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ శివారు మన్నెగూడలో ఉన్న పార్క్‌వుడ్ పాఠశాలలో ఇంటర్ చదువుతున్న ముంబైకి చెందిన విద్యార్థినిని బెదిరింపులకు గురి చేసిన అదే పాఠశాల డైరెక్టర్ సలావుద్దీన్ ఆయూబ్ రెండేళ్లపాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాధితురాలు, ఆమె తల్లి ఘటపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన సిసిఎస్ పోలీసులు ఆరోపణలు రుజువు కావడంతో సలావుద్దీన్ ఆయూబ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
సలావుద్దీన్‌పై ఐపిసి 376, 354, 506, 201 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మూడేళ్లపాటు విచారణ కొనసాగిన అనంతరం నాంపల్లి కోర్టు శుక్రవారం సలావుద్దీన్ ఆయూబ్‌కు పదేళ్ల కఠిన కారాగా శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది.












Click it and Unblock the Notifications