అల్లు అర్జున్ కు రూ.వెయ్యి కోట్ల ఆఫర్?
అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప2. మైత్రీ మూవీస్ బ్యానర్ పై నిర్మాతలు యెర్నేని నవీన్, వై.రవిశంకర్ దీన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ దర్శకుడు. దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్నారు. పుష్ప సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ జాతీయ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా రికార్డులపై రికార్డులు నెలకొల్పుకుంటూ వెళుతున్న పుష్ప ఎదుట మరో రికార్డ్ వచ్చి నిలిచినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పుష్ప 2 ను నిర్మాతలు రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు రూ.వెయ్యి కోట్ల ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల కోసం ఈ భారీ మొత్తం ఆఫర్ గా వచ్చింది. దక్షిణాదిలో గతంలో ఏ సినిమాకు ఇలాంటి ఆఫర్ రాలేదు. దీనిపై మైత్రీ నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

మైత్రీమూవీస్ నిర్మాతలు ఇటీవల వరుసగా విజయాలు అందుకుంటున్నారు. వీరి బ్యానర్ నుంచి విడుదలైన ఖుషి కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. పుష్ప2 పై పెట్టిన పెట్టుబడికి రెట్టింపుస్థాయిలో వ్యాపారం జరుగుతోంది. పుష్ప 2లో మరిన్ని కొత్త పాత్రలను సుకుమార్ సృష్టించారు. ఈసారి ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్ కు జాతీయ అవార్డు వస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో కూడా మరో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ను దేవిశ్రీప్రసాద్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ కు ఈ సినిమాద్వారా జాతీయ అవార్డు రావడంపై తెలుగు సినీ పరిశ్రమలోని అన్నివర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. సుకుమార్ సినిమా అంటేనే పాత్రల చిత్రీకరణ చాలా సహజంగా ఉంటుందని, పుష్ప 2 లో కూడా అల్లు అర్జున్ ఇదే తరహా నటనను కనపరచాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications