బట్టలు మార్చుకొస్తానని చెప్పి శవమై తేలింది
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలోని పాఠశాలలో రమ్య అనే పదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సాయంత్రం స్టడీ అవర్ ముగించుకొని బట్టలు మార్చుకునేందుకు స్కూల్ బిల్డింగ్ పైకి వెళ్లిన రమ్య వాటర్ ట్యాంకులో శవమై తేలింది. బట్టలు మార్చుకొని వస్తానని చెప్పిన రమ్య ఎంత సేపటికి రాకపోయేసరికి అనుమానం వచ్చిన సిబ్బంది పాఠశాల ఆవరణలో వెతికారు. చివరకు ట్యాంకులో పడి ఉన్న రమ్యను గుర్తించారు.












Click it and Unblock the Notifications