ఏపీలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు: ఆ జిల్లాలో సున్నా కేసులు, మరణాలు ‘0’

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో 36,189 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 117 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,87,466కు చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

కాగా, గత 24 గంటల్లో కరోనాతో ఏ ఒక్కరూ కూడా మరణించలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 7152 మంది మరణించారు. ఒక్క రోజు వ్యవధిలో 128 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 8,78,956కు చేరింది. ప్రస్తుతం ఏపీలో 1358 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,30,12,150 నమూనాలను పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

117 new corona cases reported in andhra pradesh: no deaths in last 24 hours

ఏపీలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 4, చిత్తూరులో 16, తూర్పుగోదావరిలో 6, గుంటూరులో 17, కడపలో 4, కృష్నాలో 26, కర్నూలులో 7, నెల్లూరులో 6, ప్రకాశంలో 3, శ్రీకాకుళంలో 0, విశాఖపట్నంలో 19, విజయనగరంలో 2, పశ్చిమగోదావరి జిల్లాలో 7 కరోనా కేసులు నమోదయ్యాయి.

Recommended Video

    #APPanchayatElections:ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి... బ్యాలెట్ పత్రాల్ని పరిశీలించిన క‌లెక్ట‌ర్

    ఇది ఇలావుండగా, దేశంలోనూ కొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. బుధవారం 7,25,653 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,666 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,07,01,193కి చేరింది. బుధవారం 14,301 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,03,73,606కు చేరింది. గత 24 గంటల్లో 123 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 1,53,847కి చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,73,740 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 23,55,979 మంది కరోనా టీకాలు వేయించుకున్నారు. ఇక దేశంలో యూకే స్ట్రెయిన్ కరోనా కేసుల సంఖ్య 165కి చేరింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+