ఐదుగురు యువతులు సహా 12మంది టెక్కీలు దారితప్పారు
నెల్లూరు: చిత్తూరు జిల్లాలోని నాగలపురం సమీపంలోని అడవుల్లో పన్నెండు మంది టెక్కీలు కనిపించకుండా పోయారు. ఆ టెక్కీల్లో 5గురు యువతులు ఉన్నారు. కనిపించకుండా పోయిన ఎక్కువ మంది టెక్కీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు.
వారు చెన్నైలో పని చేస్తున్నారు. వారు స్థానికంగా ఉండే జలపాతంను చూసేందుకు శనివారం నాడు నాగలపురం వచ్చారు. దారి దొరకక పోవడంతో వారిలో కొందరు తిరుపతిలోని ఓ విలేకరికి ఫోన్ చేశారు. దీంతో, వారు దారి దొరకకుండా అదృశ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది.

సదరు విలేకరి నాగలపురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. కాగా, సదరు టెక్కీలు భూపతేశ్వర కోన వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. వారిని తీసుకు వచ్చేందుకు పోలీసులు శనివారం బయలుదేరారు.












Click it and Unblock the Notifications