బాబు కాన్వాయ్‌లో 12 వాహనాలు, విజయవాడలో..

హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రక్షణ కోసం పోలీసు శాఖ పన్నెండు కొత్త వాహనాలను బెజవాడలో రిజిస్ట్రేషన్ చేయించింది. ఏపీ 18పీ నెంబరును రవాణాశాఖ వాహనాలకు కేటాయించింది. చంద్రబాబు విజయవాడ, ఇరుగు పొరుగు ప్రాంతాలకు వచ్చిన సమయంలో ఈ కాన్వాయ్ వినియోగించనున్నారట.

కాన్వాయ్‌లోని పన్నెండు వాహనాలలో ఆరు ఫార్చ్యూనర్స్, ఆరు ఇన్నోవా వాహనాలు ఉన్నాయి. రాష్ట్ర ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ పేరిట ఏపీ 18పీ 0011 నుండి 0016 వరకు, రాష్ట్ర డీజీపే పేరిట ఏపీ 18పీ 0017 నుండి 0022 వరకు వాహనాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి.

12 vehicles in Chandrababu convoy

స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు గడువు పెంచండి: కవిత

తెలంగాణ రాష్ట్రంలో బీడి కార్మికుల పిల్లల విద్యకోసం ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనాలకుదరఖాస్తుచేసుకునే గడువును పెంచాలని నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర కార్మిక శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ని కలిసి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీలో మంత్రిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

ఉపకార వేతనాల కోసం ప్రభుత్వం విధించిన జూలై 31వ తేదీ గడువును ఆగస్టు 15 వరకు పెంచాలని కోరారు. సమయం తక్కువగా ఉండడం వల్ల చాలామంది విద్యార్ధులు బ్యాంకు ఖాతాలు తెరవలేకపోయారన్నారు. తెలంగాణ ప్రాంతంలో అధికంగా బీడి కార్మికులు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని వారి సంక్షేమం కోసం ఈ ఉపకార వేతనాలు తోడ్పడతాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+