ఏపీలో 1337 కరోనా కేసులు: 9 మంది మృతి

ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గత 24 గంటల్లో68,568 కరోనా పరీక్షలు నిర్వహించారు. 1,337 మందికి పాజిటివ్ అని వచ్చింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 231 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 198, ప్రకాశం జిల్లాలో 161, కృష్ణా జిల్లాలో 144, గుంటూరు జిల్లాలో 141, నెల్లూరు జిల్లాలో 139, పశ్చిమ గోదావరి జిల్లాలో 128 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.

1,282 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,38,690 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,09,921 మంది కోలుకున్నాఆరోగ్యవంతులయ్యారు. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 14,699గా ఉంది. కరోనా మృతుల సంఖ్య 14,070కి పెరిగింది.

1337 people infected corona in andhra pradesh

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.

Recommended Video

    వినాయక విగ్రహాల ధరలతో బెంబేలెత్తుతున్న భక్తులు!!

    ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ అని నిపుణులు చెప్పడంతో భయాందోళన నెలకొంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+