కాకినాడలో విషాదం: లిఫ్ట్ పడి 14 ఏళ్ల బాలుడు మృతి

14 year boy dies in Kakinada
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ అపోలో ఆసుపత్రిలో దారుణం జరిగింది. పద్నాలుగేళ్ల బాలుడు లిఫ్ట్‌కు, డోర్‌కు మధ్యలో ఇరుక్కొని మృతి చెందాడు. కాకినాడ అపోలో ఆసుపత్రిలో ఈ పద్నాలుగేళ్ల బాలుడు రమేష్ తల్లిదండ్రులు క్యాంటీన్లో పని చేస్తున్నారని సమాచారం.

అతను తల్లిదండ్రులకు తోడుగా కొద్ది రోజులుగా వస్తున్నాడు. అలాగే గురువారం వచ్చాడు. నాలుగో ఫ్లోర్‌లో చాయ్ ఇచ్చేందుకు వెళ్లాడు. అయితే అతను వెళ్తుండగా నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ కూలిపోయింది. దీంతో అతను లిఫ్ట్‌కు, డోర్‌కు మధ్యలో ఇరుక్కొని మృతి చెందాడు. తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు మృతి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంవద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రక్కన కూర్చున్న ఓ కుటుంబంపైకి లారీ దూసుకువెళ్ళింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులు ప్రకాశం జిల్లా కురిచేడు వాసులు.

ప్రకాశం జిల్లా కురిచేడులోని ఒకే కుటుంబానికి చెందిన వారంతా తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు టెంపోలో బయలుదేరారు. కొడవలూరు సమీపంలో వారి వాహనం టైర్ పంక్చర్ అయింది. దాంతో డ్రైవర్ వాహనాన్ని పక్కకు ఆపి పంక్చర్ వేస్తున్నాడు. అయితే ఆ వాహనంలోని వారంత జాతీయ రహదారి పక్కనే కూర్చుని ఉన్న సమయంలో... విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న లారీ వారిపై నుంచి దూసుకుపోయిందని, ఆ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+