ఏపీలో కొత్తగా 1732 పాజిటివ్ కేసులు... మరో 14 మంది మృతి...

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 1732 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 14 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,47,977కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 6828కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,915 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం (నవంబర్ 11) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజాగా మరో 1761 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24గంటల్లో మొత్తం 70,405 శాంపిల్స్‌ పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 788.63లక్షలకు చేరింది.

1732 new coronavirus cases reported in andhra pradesh

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 344 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో 246 కేసులతో కృష్ణా జిల్లా.. 227 కేసులతో పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయి. అత్యధికంగా తూర్పు గోదావరిలో ఇప్పటివరకూ 1,19,501 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తాజాగా నమోదైన మరణాల్లో...కృష్ణా జిల్లాలో ముగ్గురు,అనంతపురం,చిత్తూరు,విశాఖపట్నం,పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు,తూర్పు గోదావరి,గుంటూరు,నెల్లూరు జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు.

ఇక దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86,36,011లక్షలకు చేరింది. గడిచిన 24గంటల్లో కొత్తగా 44,281 మంది కరోనా బారినపడ్డారు. కొత్తగా మరో 512 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,27,571కి చేరింది. ప్రస్తుతం దేశంలో కేవలం 4,94,657 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటివరకూ 80,13,783 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.దీంతో జాతీయ స్థాయిలో రికవరీ రేటు 92.79శాతానికి చేరింది. మరణాల రేటు 1.48శాతంగా ఉంది.

Recommended Video

    COVID -19 : ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా సెకండ్ వేవ్.. అప్రమత్తంగా ఉండాలంటున్న WHO

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+