మెడికల్ పీజి స్కామ్ కేసు: 19 మంది అరెస్టు

19 మందిలో ఎంబిబిఎస్ పూర్తి చేసిన విద్యార్థులు ఉండడం గమనార్హం. అరెస్టైన వారిలో సురేష్ అనే వ్యక్తి బెంగుళూరుకు చెందిన రియాల్టర్ అని, అతని ద్వారానే ఈ మొత్తం స్కామ్ జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సురేష్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కేసు వివరాలు బయటకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఈ స్కాంలో మరి కొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉంది. స్కామ్‌లో రాజకీయంగా గానీ, మరే విధంగా గానీ ఎవరెవరి హస్తముందన్న దిశలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ స్కామ్‌లో ఎవరి హస్తమున్నా ఎంతటివారినైనా అరెస్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ కేసుకు సంబంధించిన నివేదికను సిఐడి అధికారులు గవర్నర్‌కు శనివారం సాయంత్రానికి అందజేసే అవకాశం ఉంది. నివేదిక ఆధారంగా మెడికల్ పిజి పరీక్షలపై గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు. నాలుగు వారాల్లో మరోసారి మెడికల్ పీజీ ఎంట్రన్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు సమాచారం. ఈసారి పరీక్ష ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications