బీచ్‌లో విషాదం: ఒకరిని బలిగొన్న కెరటం, మరొకరి జాడ గల్లంతు (ఫోటోలు)

విశాఖపట్నం: బీచ్‌లో స్నాం చేయాలనే ఆ యువకుల సరదా విషాదంగా మారింది. పెద్దగా వచ్చిన ఓ మాయదారి కెరటం తనతో పాటు ఇద్దరు యువకులను తీసుకుపోయింది. అందులో ఒక యువకుడిని కెరటం బలిగొనగా, మరో యువకుడు గల్లంతయ్యాడు.

అప్పటి వరకు స్నానం చేసిన మరో యవకుడు ఒడ్డుకు చేరడంతో ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. గల్లంతైన యువకుని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

విజయవాడ వన్‌టౌన్ సాయిరాం థియేటర్ దరి భీమన్నపేటకు చెందిన నీలం మహేష్ (23), విష్ణుమూర్తి (23), ప్రభు కిరణ్ (22)లు కలిసి మంగళవారం అన్నవరం వచ్చారు. సత్యదేవుని దర్శనం అనంతరం వీరు మధ్యాహ్నాం 2 గంటలకు కైలాసగిరి వెళ్లారు.

అక్కడ నుంచి సాయంత్రం 4 గంటలకు బీచ్ రోడ్డు హోటల్ నోవాటెల్ ఎదురుగా ఉన్న వరుణ్ బీచ్‌లో స్నానానికి దిగారు. ముగ్గురు కొంత సేపు సరదా గడిపిన అనంతరం మహేష్, ప్రభుకిరణ్‌లు బయటకు వచ్చారు.

ఈ క్రమంలో విష్ణుమూర్తిని ఓ పెద్ద కెరటం లోపలికి తీసుకెళ్లింది. దీంతో కేకలు వేసిన అతనిని రక్షించే ప్రయత్నంలో మహేష్ కూడా లోపలికి వెళ్లాడు. ఇంతలో మరో పెద్ద కెరటం వచ్చి మహేష్‌ను కూడా లోపలికి తీసుకెళ్లింది.

ఒకరిని బలిగొన్న కెరటం, మరొకరి జాడ గల్లంతు

ఒకరిని బలిగొన్న కెరటం, మరొకరి జాడ గల్లంతు

బయట ఉన్న ప్రభుకిరణ్ తన స్నేహితులను రక్షించాలని కేకలు వేసినా, ఫలితం లేకపోయింది. విష్ణుమూర్తి ఆచూకీ లభ్యం కాకపోగా, మహేష్ కొద్ది సేపటికే ఒడ్డుకు కొట్టుకొచ్చాడు. బీచ్‌లో అటువైపుగా వెళ్తున్న ఓ డాక్టర్ మహేష్‌ను బతికించేందుకు చేసిన ప్రయత్నం వృథా అయింది.

 ఒకరిని బలిగొన్న కెరటం, మరొకరి జాడ గల్లంతు

ఒకరిని బలిగొన్న కెరటం, మరొకరి జాడ గల్లంతు

మహేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. గల్లంతైన విష్ణుమూర్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 ఒకరిని బలిగొన్న కెరటం, మరొకరి జాడ గల్లంతు

ఒకరిని బలిగొన్న కెరటం, మరొకరి జాడ గల్లంతు

ఇటీవల కాలంలో ఆర్కేబీచ్‌, వరుణ్ బీచ్, తదితర ప్రాంతాల్లో ఇటీవల దొంగతనాలు అధికమయ్యాయి. వీటిని నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీచ్ స్నానానికి దిగిన ముగ్గురు యువకులు వారి బ్యాగ్‌లను ఒడ్డున పెట్టారు.

 ఒకరిని బలిగొన్న కెరటం, మరొకరి జాడ గల్లంతు

ఒకరిని బలిగొన్న కెరటం, మరొకరి జాడ గల్లంతు

ఇంతలో జరిగిన సంఘటనతో సందర్శకులు ఘటనా స్థలం వద్ద గుమిగూడారు. పోలీసులు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇంతలో దొంగలు మహేష్ బ్యాగ్‌ను దొంగిలించుకుపోయారు. కొద్దిసేపటికే బ్యాగులో ఉన్న సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+