సూర్యాపేట రాత్రి ఫైరింగ్ సవాలే, ఎస్పీ బదలీ: రోదనలు (పిక్చర్స్)
నల్గొండ: వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసుల పైన దుండగులు కాల్పులు జరిగిన సంఘటన నల్గొండ జిల్లా సూర్యాపేటలో కలకలం సృష్టించింది. సంఘటన ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి గురువారం సందర్శించారు. అనంతరం సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో ఉన్న కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేష్ మృతదేహాలకు పూల మాట వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనలో స్థానికుల పాత్ర లేదని యూపీ గ్యాంగే ఈ కాల్పులకు పాల్పడినట్లు చెప్పారు. కాల్పులు జరిపిన వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. కాగా, దుండగుల ఘాతుకానికి సంబంధించి అక్కడి సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.
అయితే దుండగులు ముందస్తు ప్రణాళికతో సీసీ కెమెరాలు లేని చోటుకు పోలీసుల్ని తీసుకెళ్లి కాల్చారు. దాంతో కొన్ని దృశ్యాలు మాత్రమే రికార్డయ్యాయి. సూర్యాపేట బస్టాండ్ సమీపంలోని సీసీ కెమెరాల్లో కాల్పుల దృశ్యాలు కెమెరాల్లో కనిపించాయి. తనకు బుల్లెట్ గాయం తగిలినా హోంగార్డు కిషోర్ ధైర్యంగా నడుచుకుంటూ వెళ్లడం స్పష్టంగా దృశ్యాల్లో రికార్డయింది. పోలీసులు విచారిస్తున్నారు.
దుండగులు ఎక్కడకు పారిపోయారు? హైదరాబాదులో జ్యోతిష్కుడు నాగరాజు కాల్పులతో సంబంధం ఉందా? ఇలా ఈ కాల్పులపైన ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా, పోలీసుల పైన కాల్పులు జరిపిన దుండగులు.. వెళ్తూ వెళ్తూ దొరబాబు అనే వ్యక్తి పైన కూడా కాల్పులు జరిపారు. వీరిని పోలీసులుగా భావించి దుండగులు కాల్పులు జరిపి ఉంటారని భావిస్తున్నారు. కాగా, నల్గొండ ఎస్పీ ప్రభాకర రావును ప్రభుత్వం బదలీ చేసింది. ఆయన స్థానంలో నల్గొండ ఎస్పీగా విక్రంజిత్ దుగ్గల్‌ను నియమించింది. రాత్రి ఆపరేషన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదని బదలీ వేటు వేసినట్లుగా తెలుస్తోంది.

సూర్యాపేట కాల్పులు
నల్గొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో బుధవారం అర్ధరాత్రి దారుణం జరిగిన విషయం తెలిసిందే. దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు.

సూర్యాపేట కాల్పులు
బస్టాండ్‌లో బందోబస్తు డ్యూటీలో ఉన్న హోం గార్డులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. వారు వెంటనే సీఐకి సమాచారం అందజేశారు.

సూర్యాపేట కాల్పులు
సీఐ వచ్చిన తర్వాత హోం గార్డులు ఆ వ్యక్తిని సోదా చేయడానికి ప్రయత్నించగా అతడు తుపాకీతో కాల్పులు జరిపాడు.

సూర్యాపేట కాల్పులు
దీంతో కానిస్టేబుల్ లింగయ్య, హోం గార్డు మహేశ్ అక్కడికక్కడే చనిపోయారు. సీఐ మొగిలయ్య, హోం గార్డు కిషోర్ తీవ్రంగా గాయపడ్డారు.

సూర్యాపేట కాల్పులు
మరో ప్రయాణికుడికి కూడా గాయాలయ్యాయి. అంతకు కొద్దిసేపటికి ముందు కారులో హైదరాబాద్ వస్తున్న దొరబాబు అనే వ్యక్తిపై కూడా ఇద్దరు కాల్పులు జరిపినట్టు తెలిసింది.

సూర్యాపేట కాల్పులు
గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దొంగలు పారిపోయే క్రమంలో ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తున్న కారును అడ్డగించారు. కారులో ఉన్న దంపతులపై కూడా కాల్పులు జరిపారు.

సూర్యాపేట కాల్పులు
హైదరాబాద్ రేంజ్ ఐజీ నవీన్‌చంద్, డీఐజీ గంగాధర్, జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాల్పుల ఘటనపై జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా హై అలర్ట్‌ను ప్రకటించాం.

సూర్యాపేట కాల్పులు
సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. కాల్పులు జరిపింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠాగా అనుమానిస్తున్నామని చెప్పారు.

సూర్యాపేట కాల్పులు
దొంగలు రివాల్వర్, గన్‌మెన్ కార్బన్‌ను ఎత్తుకెళ్లారు. సీఐ మొగులయ్య ఛాతి బాగంలో రెండు బుల్లెట్లు, భుజంలో ఒక బుల్లెట్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుల కోసం పోలీసు బృందాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయని ప్రభాకర రావు చెప్పారు.

సూర్యాపేట కాల్పులు
సూర్యాపేట కాల్పుల ఘటనలో మృతి చెందిన కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేష్ మృతదేహాలను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబసభ్యుల రోదనలతో ఆస్పత్రిలో విషాదం నెలకొంది.

సూర్యాపేట కాల్పులు
కానిస్టేబుల్ లింగయ్య స్వగ్రామం శాలిగౌరారం మండలం ఉట్కూరు. ఆయనకు ఓ కూతరు ఉంది. అలాగే హోంగార్డు మహేష్ స్వగ్రామం తుంగతుర్తి మండలం వెలుగుపల్లి. ఆయన భార్య, కూతురు ఉన్నారు.

నాయిని
సంఘటన ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి గురువారం సందర్శించారు. అనంతరం సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో ఉన్న కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేష్ మృతదేహాలకు పూల మాట వేసి నివాళులర్పించారు.

నాయిని
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనలో స్థానికుల పాత్ర లేదని యూపీ గ్యాంగే ఈ కాల్పులకు పాల్పడినట్లు చెప్పారు. కాల్పులు జరిపిన వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు.












Click it and Unblock the Notifications