మరో స్నేక్ గ్యాంగ్!: బాయ్‌ఫ్రెండ్ పారిపోయాకే రేప్, ఫోటోలు తీశారు

హైదరాబాద్: రాజధాని హైదరాబాదులో మరో దారుణం జరిగిన విషయం తెలిసిందే. పెద్ద అంబర్ పేట పరిధిలో నగర ఔట్ స్కర్ట్స్‌కు ఓ యువతి, ఆమె బాయ్‌ఫ్రెండ్ వెళ్లారు. బాయ్‌ఫ్రెండ్‌ను బెదిరించిన ఇద్దరు నిందితులు యువతి పైన అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయమై వనస్థలిపురం ఏసీపీ భాస్కర్ గురువారం వివరాలు వెల్లడించారు.

ఈ అత్యాచారం పైన నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులు లింగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నామన్నారు. యువతి స్నేహితుడు పారిపోయిన తర్వాతనే ఆమె పైన అత్యాచారం జరిగిందని చెప్పారు.

స్నేహితుడితో సన్నిహితంగా ఉన్న సమయంలో నిందితులు ఫోటోలు తీశారని చెప్పారు. సెల్‌ఫోన్‌లను ఎఫ్ఎస్ఎల్ పరీక్ష నిమిత్తం పంపినట్లు చెప్పారు. బాధిత యువతి, బాయ్ ఫ్రెండ్ అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చే వారని తెలిపారు. ఇది గమనించిన నిందితులు వారి పైన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అభిప్రాయపడ్డారు.

22 year old student gangraped in Hyderabad, after boy friend fled

బాధితులు ఎవరు లేని ప్రాంతానికి, పూర్తిగా లోపలకు వెళ్లి పోయారని అభిప్రాయపడ్డారు. మెయిన్ రోడ్డు పైన ఉండి ఉంటే నిందితులకు అవకాశం దొరికి ఉండేది కాదన్నారు. నిందితులు పెద్ద అంబరుపేటకు చెందిన వారన్నారు. దీని పైన విచారణ చేస్తున్నామని చెప్పారు. ఇలాంటి విషయాల పట్ల అందరు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

సెల్‌ఫోన్లో ఏమైనా ఆధారాలు దొరికితే ఐటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. నిందితులు పాత నేరస్తులు కాదని చెప్పారు.

కాగా, రాజధాని హైదరాబాదులో మరో దారుణం జరిగింది. స్నేహితుడితో ఔట్ స్కర్ట్స్‌కు వెళ్లిన ఓ యువతి పైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిని బెదిరించి మరీ సామూహిక అత్యాచారం చేశారు. పెద్ద అంబరుపేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో సోమవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది.

నగరానికి చెందిన 22 ఏళ్ల యువతి తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి వెళ్లింది. అక్కడ వారిద్దరే ఉండటాన్ని గమనించిన శ్రీనివాస్ రెడ్డి, లింగారెడ్డి అనే యువకులు వారి వద్దకు వెళ్లి, పోలీసు ఇన్ఫార్లమని చెప్పి అడ్డుకున్నారు. అది నిర్మానుష్య ప్రాంతం.

వారిద్దరు కలిసి ఆ యువకుడిని కొట్టారు. ఆ తర్వాత యువతి పైన అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె ఫోన్ నుండి నంబర్ తీసుకున్నారు. బాయ్ ఫ్రెండ్, యువతి సన్నిహితంగా ఉన్న చిత్రాలను సెల్ ఫోన్లో బందించామని, తాము ఎప్పుడు పిలిచినా రావాలని బెదిరించారు. వారు ఒకరి తర్వాత ఒకరు ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+