టీడీపీ ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ.23 లక్షలు మాయం !!

సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పూటకే రూపం మారుస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు ఈ కేటుగాళ్లు. సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా ప్రజాప్రతినిధులు, పెద్ద వ్యాపారవేత్తలు కూడా వీరి బారిన పడుతున్నారు. సెల్‌ఫోన్‌లకు వచ్చే అనుమానాస్పద లింకులు, కాల్స్‌ను నిర్లక్ష్యంగా క్లిక్ చేయడం వల్ల పెద్ద మొత్తంలో డబ్బు పోతున్న ఘటనలు వరుసగా బయటపడుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి సైతం ఈ సైబర్ మోసానికి గురైనట్టు తెలుస్తోంది.

వాట్సాప్ లింక్‌తో మోసం..

గత నెల 22న ఎమ్మెల్యే వ్యక్తిగత వాట్సాప్ నెంబర్‌కు ఆర్టీఏ బకాయిలు చెల్లించాలంటూ ఒక లింక్ వచ్చింది. తన కంపెనీ వాహనాలకు సంబంధించిన ఫైన్ అని అనుకుని ఆయన ఆ లింక్‌ను ఓపెన్ చేశారు. వెంటనే ఆయన సిమ్ కార్డు బ్లాక్ అయ్యింది. ఈ సమయంలోనే సైబర్ నేరగాళ్లు ఆయన వ్యక్తిగత డేటాకు యాక్సెస్ సాధించారు.

23-lakhs-sttolen-from-kavali-tdp-mla-by-crber-criminals

రూ. 23 లక్షలు మాయం..

సుమారు 25 రోజుల పాటు ఆయన సిమ్ పనిచేయలేదు. తిరిగి సిమ్ యాక్టివేట్ అయిన తర్వాతే అసలు షాక్ ఎదురైంది. గత నెల 25 నుంచి ఈ నెల 16 వరకు, ఆయనకు చెందిన రెండు యాక్సిస్ బ్యాంక్ ఖాతాల నుంచి యూపీఐ ద్వారా దశలవారీగా రూ. 23,16,009 మొత్తాన్ని నేరగాళ్లు ఖాళీ చేశారు. కాగా ఎమ్మెల్యే కంపెనీ సిబ్బంది సాధారణ లావాదేవీలను పరిశీలిస్తున్నప్పుడు ఈ అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు గమనించారు. వెంటనే ఆయనకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

కాగా ఈ ఘటనపై ఎమ్మెల్యే హైదరాబాద్ ఆధార్ విజిలెన్స్ విభాగానికి సమాచారం అందించారు. తర్వాత కావలి పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డబ్బు ఎక్కడికి మళ్లించబడిందో.. ఏ ఖాతాల్లోకి వెళ్ళిందో వెతికే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

సైబర్ పోలీసుల హెచ్చరిక..

ఈ క్రమంలోనే సెల్‌ఫోన్, వాట్సాప్, ఈమెయిల్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను ఎప్పుడూ క్లిక్ చేయవద్దని సైబర్ పోలీసులు తరచూ హెచ్చరిస్తున్నారు. RTA, బ్యాంకులు, ప్రభుత్వ విభాగాలు ఎప్పుడూ వ్యక్తిగత లింకుల ద్వారా బకాయిలు చెల్లించమని అడగవని.. ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారానే లావాదేవీలు చేయాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+