ఓటెత్తిన మహిళలు, వృద్దులు - ఏ జిల్లాలో ఎంత, ఏంటి సంకేతం..!!
ఏపీలో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. ఏపీలో ఓటర్ల జాతర కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు, వృద్దులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. మొత్తం 25 ఎంపీ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పోలింగ్ ఆరంభం సమయానికే భారీగా ఓటర్లు తరలి వచ్చారు. గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తోంది. పోలింగ్ సరళి గమనిస్తున్న పార్టీల నేతలు ఫలితం పైన అంచనా వేస్తున్నారు.
ఏపీలో తొలి నాలుగు గంటల్లో 24.31 శాతం మేర పోలింగ్ నమోదు అయింది. వీరిలో 24.17 శాతం మేర మహిళలు ఓట్లువేసారు. 23.68 శాతం మేర పురుషులు ఓట్లు వేసినట్లు గణాంకాలు స్పస్టం చేస్తున్నాయి. దీంతో.. ఇప్పటి వరకు సుమారు కోటి మంది ఓటర్ల పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. కడప 27 శాతం, నెల్లూరు 23.77, సత్యసాయి 20.61, శ్రీకాకుళం 21.37, పశ్చిమ గోదావరి 23.26, అనంతపురం 223.90, అన్నమయ్య 22.28, బాపట్ల 26.88, చిత్తూరు 25.81, కోనసీమ 26.74, గుంటూరు 20.84, ఏలూరు 24.28, కాకినాడ 21.6, కర్నూలు 22.05, నంద్యాల 27.19 శాతం మేర పోలింగ్ నమోదైంది.

ఎన్టీఆర్ జిల్లాలో 21.39 శాతం, మాన్యం 15.40, ప్రకాశంలో 23.89, కర్నూలు-22.05, నెల్లూరు 23.77 మేర పోలింగ్ శాతంనమోదలైంది. అక్కడక్కడా చెదురు మదురు ఘటనల మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. పల్నాడులో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలింగ్ కేంద్రాల్లో యువతతో పాటుగా మహిళలు, వృద్దులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. దీంతో..పార్టీలు పోలింగ్ సరళిని నిశితంగా గమనిస్తున్నాయి. ఓటరు ఎవరికి పట్టం కడుతున్నారనేది నాడి తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో మహిళా ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండటంతో ప్రధాన పార్టీలు లెక్కలు వేస్తున్నాయి. దీంతో, సాయంత్రం పోలింగ్ శాతం ఎంత నమోదు కానుందనేది కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications